BREAKING: విద్యార్థులకు పండగే.. మళ్ళీ పది రోజులు సెలవులు!
కుల గణన సర్వే నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థలకు పది రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి 18 వరకు కర్ణాటకలోని అన్ని పాఠశాలలకు సెలవులు ఉంటాయని తెలిపింది.
కుల గణన సర్వే నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థలకు పది రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి 18 వరకు కర్ణాటకలోని అన్ని పాఠశాలలకు సెలవులు ఉంటాయని తెలిపింది.
మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ అస్వస్థతకు గురయ్యారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 92 ఏళ్ల దేవెగౌడ ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆయనను బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు.
స్టార్ హీరో సుదీప్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్ కు ఊహించని షాక్ తగిలింది.కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (KSPCB), బెంగళూరు శివార్లలోని బిడది హోబ్లీలో ఉన్న బిగ్ బాస్ కన్నడ నిర్మాణ స్థలానికి నోటీసు ఇచ్చింది.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించిందో ముఠా.. అనంతరం ఆ వ్యక్తి భార్యనంటూ ముఠా సభ్యురాలు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసింది. అయితే, అసలు భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ ముఠా ప్రయత్నం బెడిసికొట్టింది.
కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కుణిగల్ ఎమ్మెల్యేతో పాటు మరికొందరు పార్టీ నేతలు డీకే శివ కుమార్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నామని డిమాండ్ చేయడం సంచలనం రేపింది.
భారత్లో తయారయ్యే విదేశీ మద్యం వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు మరోసారి ముందంజలో నిలిచాయి. కాగా మద్యం అమ్మకాలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం (FY25)లో దేశవ్యాప్తంగా వచ్చిన ఆదాయంలో 58శాతం రాబడి ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచే వచ్చిందని తేలింది.
BRS మీడియా, హరీష్ రావు మీడియా, సంతోష్ రావు మీడియా నన్నే టార్గెట్ చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన 'ఆయిల్ కుమార్' అనే వ్యక్తి విచిత్రమైన ఆహారపు అలవాట్లతో వార్తల్లోకి ఎక్కాడు. సాధారణ ఆహారానికి బదులు ఇంజిన్ ఆయిల్, పెట్రోల్ వంటివి తాగుతూ 33ఏళ్లుగా జీవిస్తున్నాడని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది.
కర్ణాటకలో మరోసారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గతంలో నగదు తరలించే వాహనంపై దాడి చేసి భారీగా నగదు ఎత్తుకెళ్లిన దొంగలు ఈసారి ఏకంగా బ్యాంక్పైనే దాడి చేశారు. ఎస్బీఐ బ్యాంక్లోకి చొరబడి.. సిబ్బందిని బెదిరించి రూ.58 కోట్ల విలువైన నగదు, నగలు ఎత్తుకెళ్లిపోయారు.