DK Shiva Kumar: కారు లేకుంటే అబ్బాయిలకు పిల్లనివ్వడం లేదు.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వరంటూ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య డీకే శివకుమార్‌ సెటైర్లు వేశారు.

New Update
DK Shiva Kumar

DK Shiva Kumar

కర్ణాటక(karnataka) డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(dk-shiva-kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వరంటూ పేర్కొన్నారు. బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్యలు తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం టన్నెల్ రోడ్‌ ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీన్ని సమర్థిస్తూ డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. టన్నెల్ రోడ్ ప్రాజెక్టును రద్దు చేయాని, మాస్ ట్రాన్స్‌పోర్ట్‌ను విస్తరించాలని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య డీకే శివకుమార్‌ను కలిసి అభ్యర్థించారు.

Also Read: దారుణం.. పొలాల్లోకి లాక్కెళ్లి 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రే*ప్

DK Shiva Kumar Sensational Comments

దీనిపై మీడియాతో స్పందించిన డీకే శివకుమార్.. '' ప్రజలు కార్లు కొనే అంశం వెనుకున్న సామాజిక పరిస్థితి సూర్యకు అర్థం కాదు. మీరు మీ సొంత వాహనంలో రాకుండా నేను ఆపొచ్చా ?. ప్రజలు కూడా వాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి సొంత వాహనంలో వెళ్లేందుకు ఇష్టపడతారు. వాళ్లని కార్లు వాడకండి అని చెబుతామా ?.. కావాలంటే ప్రజా రవాణాను వినియోగించుకోవాలని ఎంపీలు తమ నియోజకవర్గ ప్రజలకు సూచనలు చేయొచ్చు. ఎంతమంది దీన్ని పాటిస్తారో చూడాలి. ప్రస్తుతం సొంత కారు అబ్బాయిలకు పిల్లను ఇచ్చేందుకు కూడా ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి వచ్చిందని'' అన్నారు. 

డీకే శివకుమార్ వ్యాఖ్యలపై ఎంపీ తేజస్వీ సూర్య స్పందించారు. '' బెంగళూరు ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం టన్నెల్ రోడ్‌ ప్రాజెక్టును తీసుకొచ్చిందని నేను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది అసలు ప్రజల సమస్యను తీర్చేందుకు కాదని డీప్యూటీ ముఖ్యమంత్రే స్వయంగా క్లారిటీ ఇచ్చారని'' సెటైర్లు వేశారు. అంతేకాదు డీకేతో సమావేశం అయిన సందర్భంగా టన్నెల్ రోడ్‌ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని కోరానని తెలిపారు. కానీ వీటిని డీకే తిరస్కరించినట్లు అసహనం వ్యక్తం చేశారు. 

Also Read: షాకింగ్‌.. కలుషిత ఆహారం తిని 128 మంది విద్యార్థులకు అస్వస్థత

వాస్తవానికి బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ అక్కడ రోడ్లపై తీవ్రమైన ర్దదీ నెలకొంటుంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో వేచి చూడాల్సి ఉంటోంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సమస్యకు టన్నెల్ రోడ్ ప్రాజెక్టు పరిష్కారం అవుతుంది గతంలో కూడా డీకే శివకుమార్‌ పలుమార్లు చెప్పారు. అయితే దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని తేజస్వీ సూర్య దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజా రవాణా విషయంలో ఈ నిర్ణయం సరైన పరిష్కారం కాదని అంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు