/rtv/media/media_files/2025/10/28/karnataka-high-court-stays-siddaramaiah-govt-order-seen-as-move-to-curb-rss-activities-2025-10-28-14-34-20.jpg)
Karnataka High Court stays Siddaramaiah govt order seen as move to curb RSS activities
కర్ణాటకలో RSS కార్యకలాపాలకు ముందస్తు పర్మిషన్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఆరెస్సెస్ కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను నవంబర్ 17వ తేదీకి సింగిల్ జడ్జి ధర్మాసనం వాయిదా వేసింది.
Also Read: రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త!
ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాకట సర్కార్ అక్టోబర్ 18న కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏవైనా ప్రైవేటు సంస్థలు లేదా సంఘాలు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వ మైదానాలు, బహిరంగ ప్రదేశాలు, రోడ్లు లేదా విద్యాసంస్థల ఆవరణలను వాడుకోవాలనుకుంటే ముందుగా తమ పర్మిషన్ తీసుకోవాలని పేర్కొంది. ఎవరైనా ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల యంత్రాంగాలను ఆదేశించింది. ఈ క్రమంలోనే ప్రైవేటు సంస్థల హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఓ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది.
Also Read: తండ్రి వెధవ పనికి కూతురు సపోర్ట్.. ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్
ఆరెస్సె్స్ ఏర్పడి వందేళ్లయిన సందర్భంగా భారీ స్థాయిలో కవాతులు నిర్వహించేందుకు కర్ణాటక బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో రాజకీయంగా వివాదం ఏర్పడింది. రాష్ట్రంలో RSSను నిషేధించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. మరోవైపు నవంబర్ 17న కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read: వెళ్ళినా, వచ్చినా కూడా ఫోటోలు, బయో మెట్రిక్..యూఎస్ కొత్త రూల్ అమల్లోకి..
Follow Us