Watch Video: రైతుల వెంటపడ్డ పులి, భయంతో చెట్లెక్కిన స్థానికులు.. వీడియో వైరల్

కర్ణాటకలోని మైసూర్‌ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ పులి పొలంలో పనిచేస్తున్న రైతులను వెంబడించింది. దీంతో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు చెట్లు ఎక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Tiger chased the farmers in Karnataka

Tiger chased the farmers in Karnataka

కర్ణాటకలోని మైసూర్‌ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ పులి పొలంలో పనిచేస్తున్న రైతులను వెంబడించింది. దీంతో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు చెట్లు ఎక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ రైతును పులి దాడి చేసింది. అతడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Also Read: హిందూ అమ్మాయిలు జిమ్‌లకు వెళ్లకండి.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

 ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బడగలపుర గ్రామంలో గురువారం ఉదయం కొంతమంది రైతులు పొలాల్లో పని చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా చెట్ల పొదల్లో నుంచి ఓ పులి బయటకు పరిగెత్తుతూ వచ్చింది. పొలాల్లో పనిచేస్తున్న రైతుల వైపు దూసుకెళ్లింది. పులిని చూసిన వాళ్లు భయంతో పరుగులు తీశారు. కొందరు చెట్లు ఎక్కారు. ఈ క్రమంలోనే మహాదేవ్‌(34) అనే రైతుపై పులి దాడి చేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత పులి అక్కడి నుంచి పారిపోయింది. గాయాలపాలైన మహాదేవ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు.  

Also Read: ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు.. ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా ?

ఇదిలాఉండగా ఆ ప్రాంతంలో పులి సంచరిస్తోందని చెప్పినా కూడా అటవీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే దీనిపై అటవీశాఖ అధికారులు కూడా స్పందించారు. పులిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. దాని ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇదిలాఉండగా ఈ మధ్య కాలంలో అనేక ప్రాంతాల్లో జనావాసాల్లోకి పులులు వస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కోతులు ఇళ్లల్లోకి వస్తుండగా.. ఇప్పుడు పులులు, సింహాలు కూడా రావడం ఆందోళన కలిగిస్తోంది.  

Also Read: ఈ అక్కాచెల్లెళ్లు మామూలోల్లు కాదు.. పెళ్లిళ్లు చేసుకుంటూ డబ్బులు, నగలతో పరార్‌

Advertisment
తాజా కథనాలు