BIG BREAKING : గీజర్ నుంచి గ్యాస్ లీకై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి

బెంగళూరులో దారుణం జరిగింది. గీజర్ నుంచి గ్యాస్ లీకై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  బాత్‌రూమ్‌లో గ్యాస్ లీకేజ్ పీల్చి గుల్ఫామ్(23), సిమ్రాన్ తాజ్(20) చనిపోయారు.

New Update
mysure

బెంగళూరులో దారుణం జరిగింది. గీజర్ నుంచి గ్యాస్ లీకై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  బాత్‌రూమ్‌లో గ్యాస్ లీకేజ్ పీల్చి గుల్ఫామ్(23), సిమ్రాన్ తాజ్(20) చనిపోయారు.  గీజర్ వాయువును విడుదల చేసిందని, కానీ మంటలు అంటుకోలేదని పోలీసులు తెలిపారు. అక్కాచెల్లెళ్లు చాలా సేపు వాష్‌రూమ్ నుండి బయటకు రాకపోవడంతో, వారి తండ్రి అల్తాఫ్ అనుమానం వచ్చి డొర్ బలవంతంగా తెరిచేసరికి తన కుమార్తెలు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. 

వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు.  అల్తాఫ్ పాషాకు నలుగురు కుమార్తెలు, వారిలో ఇద్దరు వివాహం జరిగింది. చనిపోయిన గుల్బమ్ తాజ్ (23)కు ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో ఆమెకు వివాహం జరగాల్సి ఉంది. ఇద్దరు యువతులు మరణించడం అల్తాఫ్ పాషా కుటుంబాన్ని, బంధువులను తీరని దుఃఖంలో ముంచింది. పెళ్లి కూతురు కాబోతున్న కుమార్తెను అకాలంగా కోల్పోవడం ఆ కుటుంబానికి జీర్ణించుకోలేని విషాదంగా మారింది.

వంట గ్యాస్ సిలిండర్ పేలి

మరోవైపు బెంగళూరులోని కెఆర్ పురంలో శనివారం ఉదయం జరిగిన వంట గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బెంగళూరులోని త్రివేణి నగర్‌లో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పేలుడు కారణంగా భవనం కూలిపోగా, చుట్టుపక్కల ఉన్న కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు.

Advertisment
తాజా కథనాలు