Viral News: పరువు తీశారు కదరా.. విదేశీ యూట్యూబర్‌ను పేడలో ముంచిన భారతీయులు

విదేశీ యూట్యూబర్‌పై భారతీయులు పేడ చల్లి, పూర్తిగా అందులో ముంచారు. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక సంప్రదాయమైన పండుగను వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడం కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు.

New Update
Viral news

Viral news

విదేశీ యూట్యూబర్‌పై భారతీయులు పేడ చల్లి, పూర్తిగా అందులో ముంచారు. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ విదేశీ యూట్యూబర్‌ను ఎందుకు భారతీయులు పేడలో ముంచారో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Husband Suicide: 'మీ అమ్మను ఇంట్లో నుంచి గెంటేయ్'.. భార్య గొడవతో భర్త సూసైడ్

ఒకరిపై ఒకరు పేడ చల్లుకుని..

కర్ణాటకలో ఇటీవల దీపావళి సందర్భంగా 'గోరెహబ్బ' పండుగ జరిగింది. ఈ పండుగలో ప్రజలు అందరూ ఒకరిపై ఒకరు ఆవు పేడను చల్లుకుంటారు. అయితే ఈ పండుగలో  అమెరికన్ యూట్యూబర్ టైలర్ ఒలివెరా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అక్కడ గ్రామ దేవత బీరేశ్వర స్వామి ఆవు పేడ నుండి జన్మించాడని, అందువల్ల నివాసితులు ఒకరిపై ఒకరు ఆవు పేడను చల్లుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం. దీంతో అక్కడ ప్రజలందరూ దీపావళి పండుగ సందర్భంగా ఒకరిపై ఒకరు పేడ పూసుకుంటారు.

ఇందులో ఒలివెరా కూడా ఉంటాడు. షూట్, గాగుల్స్ ధరించి ఆవు పేడతో కనిపిస్తాడు. అయితే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు విమర్శిస్తున్నారు. విదేశీ  యూట్యూబర్‌ను పేడలో ముంచడం ఏంటని, పరువు తీశారు కదా అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు యూట్యూబర్‌పై విమర్శలు చేస్తున్నారు. ఇలా ఒక సంప్రదాయమైన పండుగను వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడం కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు. అయితే దీనికి ఒలివెరా కూడా స్పందించాడు. 10,000 మైళ్లు ప్రయాణించి వేల డాలర్లు ఖర్చు చేస్తున్నానని.. ఇలా వీడియో తీసి పెట్టడం వల్ల తప్పు లేదని అన్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చూడండి: Fire Accident: మరో భారీ అగ్నిప్రమాదం.. రెస్టారెంట్‌లో 4 గ్యాస్ సిలిండర్‌లు బ్లాస్ట్ - ఒకరు స్పాట్ డెడ్

Advertisment
తాజా కథనాలు