Tenth Student: తెలంగాణలో విషాదం.. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఓ పదో తరగతి బాలిక గుండె పోటుతో మరణించింది. గురువారం ఉదయం స్కూల్కి నడుచుకుని వెళ్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే స్కూల్ యాజమాన్యం సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యంలోనే ఆ యువతి మృతి చెందింది.