Fire accident : హైవేపై కారులో మంటలు..సంఘటన సమయంలో ఆరుగురు...

కామారెడ్డి మండలం క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే క్రమంగా మంటలు వ్యాపించడంతో కారు మొత్తం దగ్ధమైంది.

New Update
Fire accident

Fire accident

Fire accident  : కామారెడ్డి మండలం  క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది.  క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న స్కార్పియో కారులో మంటలు చెలరేగాయి. కారులో పొగలు రావడాన్ని గమనించి కారును డ్రైవర్‌ నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది,  డ్రైవర్‌ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.

Also Read : మరో నిర్భయ..నోట్లో గుడ్డలు కుక్కి ..కన్న కొడుకుల ముందే తల్లిపై గ్యాంగ్ రేప్!

శనివారం తెల్లవారుజామున క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై స్కార్పియో కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే కారును నిలిపి, అందులో ఉన్న వారందరిని అప్రమత్తం చేశారు. దీంతో అంతా కిందికి దిగిపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. అయితే క్రమంగా మంటలు వ్యాపించడంతో కారు మొత్తం దగ్ధమైంది.

Also read: Drugs: లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్.. తర్వాత ఏం జరిగిందంటే?

Also read :  నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్తలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.కారు భువనగిరి నుంచి బడాపహడ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయానిస్తున్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని తెలిపారు.

Also read :  పెళ్లైన తెల్లారే జంప్.. ఇప్పటికే ముగ్గురితో మూడు ముళ్లు!

Also Read : అయ్యో తల్లి.. నవరాత్రుల కోసం ప్లాన్.. పీరియడ్స్ రావడంతో సూసైడ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు