Hyderabad: ఇద్దరు చిన్నారులను సంపులో తోసి..తల్లి కూడా..

నవమాసాలు మోసి, కనిపెంచిన ఆ తల్లే తన పిల్లల ఊపిరి తీసింది. తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌ శివారులోని బాచుపల్లిలో తల్లి లక్ష్మీ తన ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసింది.

New Update
sump

sump

Crime News:నవమాసాలు మోసి, కనిపెంచిన ఆ తల్లే తన పిల్లల ఊపిరి తీసింది. తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌ శివారులోని బాచుపల్లిలో తల్లి లక్ష్మీ తన ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసింది. అప్పటి వరకు ఆనందంగా ఆడుకున్న ఆ చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు చిన్నారుల మృతదేహాలను సంపునుంచి వెలికితీయగా ఆ  దృశ్యం చూసిన వారిని కంటతడి పెట్టించింది. ముక్కుపచ్చలారని చిన్నారులను చంపడానికి ఆ తల్లికి చేతులెట్లా వచ్చాయంటూ అక్కడున్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.

ఇది కూడా చూడండి:TS ALERT : తెలంగాణకు అత్యంత భారీ వర్ష సూచన

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లక్ష్మణ్, లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం.. ఈ క్రమంలోనే.. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో భర్తతో వివాదం జరిగింది. కామారెడ్డికి చెందిన లక్ష్మణ్, రత్నమ్మ అలియాస్ లక్ష్మి దంపతులు కామారెడ్డి నుంచి బతుకుతెరువు కోసం బాచుపల్లి ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్నారు. లక్షణ్ ఇటుక బట్టీల్లో రోజువారీ కూలి పనులు చేస్తున్నాడు. లక్ష్మణ్ రత్నమ్మ దంపతులకు ఇప్పటికే నలుగురు కొడుకుల సంతానం.. వారిలో  ఇద్దరు దంపతుల దగ్గర..  మరో ఇద్దరు కామారెడ్డిలో ఉన్న తాత దగ్గర ఉంటున్నారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 71 మంది సజీవ దహనం!

అయితే వారికి ఆడపిల్ల కావాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ ప్లానింగ్‌ చేయించుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. మంగళవారం రాత్రి ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన  రత్నమ్మ అలియాస్ లక్ష్మి  అర్థరాత్రి ఇద్దరు కొడుకులు 8నెలలు, మూడేండ్ల వయసున్న అరుణ్, సుభాష్ తో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది.. ఇంట్లో ఉన్న నీటి సంపులో ఇద్దరు బాబులతో కలిసి  ఆమె దూకింది.. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు నీట మునిగి మరణించారు. నీరు తక్కువగా ఉండటంతో రత్నమ్మ బతికింది. ఈ విషయాన్నిగమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి లక్ష్మిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Also Read: ఆస్తికోసం అన్నతో బెడ్ షేర్ చేసుకున్న చెల్లి.. ప్రెగ్నెంట్ కావడంతో కోర్టు మెట్లెక్కిన పంచాయితీ!

Advertisment
తాజా కథనాలు