TG Crime : అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి కోసం.. కన్న కొడుకుని అమ్మేసింది!

సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు ఓ మహిళ తన ఐదేళ్ల కొడుకును రూ. 50 వేలకు అమ్మేసిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. అయితే ఆ బాలుడిని కొన్న మహిళ రూ. లక్షకు మరో వ్యక్తికి అమ్మేసింది. దీంతో పోలీసులకు విషయం తెలియడంతో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.  

New Update
women nizamabad

women nizamabad

సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు ఓ మహిళ తన ఐదేళ్ల కొడుకును రూ. 50 వేలకు అమ్మేసిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. అయితే ఆ బాలుడిని కొన్న మహిళ రూ. లక్షకు మరోవ్యక్తికి అమ్మేసింది. ఈ విషయం చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు, పోలీసులకు తెలియడంతో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బూస లావణ్యకు ఐదేళ్ల కింద నర్సింలు అనే వ్యక్తితో వివాహం కాగా వీరికి ఓ  పాప, బాబు ఉన్నారు. అయితే  నర్సింలు అనారోగ్యం కారణంగా చనిపోయాడు. దీంతో లావణ్య ఓ బట్టల షాపులో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. మరో వైపు లింగంపేట మండలం పర్కల్ల గ్రామానికి చెందిన సాయిలు తన భార్యతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయి కామారెడ్డిలో ఉంటున్నాడు. 

Also Read: Hacking: భారత రక్షణశాఖ వెబ్ సైట్లపై పాకిస్థానీ హ్యాకర్ల దాడి

Also read : ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?

సాయిలుతో పరిచయం

ఈ క్రమంలో లావణ్యకు సాయిలుతో పరిచయం ఏర్పడగా  అది అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే జీవనోపాధి కోసం ఆటోకొనేందుకు బాలుడిని అమ్మేయాలని సాయిలు లావణ్యను కోరాడు. ఇందుకుఒప్పుకున్నలావణ్య తన కుమారుడు నిఖిల్ ను ఇటీవల పర్మల్ల గ్రామానికి చెందిన నసీమా అనే మహిళకు రూ.50 వేలకు అమ్మేసింది. తిరిగి  నసీమా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేటలోని తన సోదరి షాహిదాకు అమ్మగా.. ఆమె ఆదే గ్రామానికి చెందిన కుంచాల శేఖర్ అనే వ్యక్తికి రూ. లక్షకు బాలుడిని విక్రయించింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బాలుడిని బాలల సంరక్షణ  కేంద్రానికి తరలించారు. బాలుడి తల్లి లావణ్యతో పాటు సాయిలు, నసీమా, షాహిదా, కుంచాల శేఖర్ లపై  కేసు నమోదు చేశారు.  

 kamareddy | nizamabad | crime | telugu-news

Also Read: Mock Drill: కేంద్ర ప్రభుత్వ బిగ్గెస్ట్ యాక్షన్ ప్లాన్.. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్..

Also read : TGSRTC : బస్సు భవన్‌‌ వద్ద ఉద్రిక్తత...ఒక్కసారిగా వందలాది మంది కార్మికులు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు