/rtv/media/media_files/2025/03/20/6ZvQo8dLuYFpLuyMzrRn.jpg)
T. Harish Rao
Harish Rao:
కాళేశ్వరం ప్రాజెక్టు్ పై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. దీన్ని క్యాబినెట్‌లో ఆమోదించి రేపు శాసనసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాలులో కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలపనుంది..అనంతరం రేపు సభలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్‌రావు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆయన నివేదికపై మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను(Kaleshwaram Commission Report) సస్పెండ్ చేయాలని కోరుతూ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టకుండా చూడాలని తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేయాలని(Kaleshwaram Case) కోరుతూ గతంలోనూ కేసీఆర్(KCR), హరీశ్‌రావు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్ల ఆధారంగా గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. నోటీసులు జారీ చేసి వాయిదా వేసింది. అక్టోబర్‌లో ఈ పిటిషన్లపై తదుపరి విచారణ చేపట్టనుంది.
Also Read : మండపం వద్ద పాటలు పెడుతుండగా కరెంట్ షాక్.. నల్గొండలో పెను విషాదం!
అసెంబ్లీలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే భయమెందుకని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సభ వాయిదా పడిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్ బాబు వాస్తవాలను వినడానికి సిద్ధంగా లేరని కామెంట్ చేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్పులు చేశారో.. లేదో తేల్చాల్సింది మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కాదని హరీశ్‌రావు అన్నారు. అది తేల్చాల్సింది కోర్టులు, ప్రజలు అని పేర్కొన్నారు. కాళేశ్వరంపై పీపీటీకి అవకాశం ఇవ్వట్లేదంటే.. అధికార పక్షం భయపడుతున్నట్లే అని పేర్కొన్నారు. వాస్తవాలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు.
గతంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌పై.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కమిషన్‌కు విచారణ చేసే అర్హత లేదని.. అందుకే ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. నివేదికకు సంబంధించి వాస్తవాలను వెల్లడించాలని తాము చేసిన విజ్ఞప్తులను.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పట్టించుకోలేదని కేసీఆర్ తన పిటిషన్‌లో ఆరోపించారు. ఇక ఇదే వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పూర్తిగా తప్పుల తడకలతో నిండిపోయి ఉందని కేసీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు తెలంగాణ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఏది కావాలో.. దాని ఆధారంగానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తయారు చేసి ఇచ్చిందని వారు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్టే ఇవ్వాలని హైకోర్టుకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిటిషన్ పై హకోర్టు అక్టోబర్‌లో విచారించనుంది.
Also Read : వరద మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు.. రూ.558.90 కోట్ల నష్టం