Telangana: కేసీఆర్‌పై చర్యలు ?.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
తెలంగాణలో కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌పై సీఎం రేవంత్ మాట్లాడారు. అవినీతి, పక్షపాతంతోనే ఈ ప్రాజెక్టును నిర్మించారంటూ మండిపడ్డారు.
తెలంగాణలో కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌పై సీఎం రేవంత్ మాట్లాడారు. అవినీతి, పక్షపాతంతోనే ఈ ప్రాజెక్టును నిర్మించారంటూ మండిపడ్డారు. ''రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్లు మార్చేశారు. ప్రాజెక్టు నిర్మించిన మూడేళ్లలోపే మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవేళ్లను ప్రారంభించారు. అన్నారం, సుందిళ్లలో లోపాలు ఉన్నట్లు NDSA నివేదిక ఇచ్చింది. ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ లోపాలు ఉన్నట్లు తేలింది. అవినీతి, పక్షపాతంతోనే ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఎన్నికలకు ముందు దీనిపై విచారణ చేయిస్తామని మేనిఫెస్టోలో చెప్పాం.
కమిషన్ ఛైర్మన్‌గా వ్యవహరించిన పీసీ ఘోష్ నిబద్ధత కలిగిన వ్యక్తి. కేసీఆర్, హరీష్ రావుతో పాటు అనేక మందిని ఘోష్ విచారించారు. 16 నెలల తర్వాత 665 పేజీల రిపోర్టు ఇచ్చారు. ఊరు, పేరు, అంచనాలు మార్చేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. అలా నిర్మించినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో కూడా చర్చిస్తాం. అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటాం. అందరి ఆమోదం మేరకు ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. ఇది రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు కాదు. కమిషన్ ఇచ్చిన నివేదికనే కేబినెట్‌లో చర్చించి ఆమోదించాం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కేసీఆర్‌ను అరెస్టు అవుతారనే అంశాన్ని ప్రస్తావించలేదు. అయితే అంతకుముందు కేసీఆర్ ఈ అంశంలో తాను అరెస్టయినా భయపడాల్సిన అవసరం లేదని పార్టీ నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది.
LIVE: Hon'ble Chief Minister Sri A Revanth Reddy Addresses Media at Dr BR Ambedkar Telangana state Secretariat, Hyderabad. https://t.co/lsMHvhM1D9
అంతకుముందు కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారు. గతంలో తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని నిర్మించినట్లు పేర్కొన్నారు. కేవలం రూ.38 వేల కోట్ల ఖర్చులో 16 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేలా డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఇష్టమొచ్చినట్లు డిజైన్లు మార్చేశారని.. అధిక వడ్డీలకు NBFCల నుంచి రుణాలు తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. మొత్తం రూ. 84 వేల కోట్ల రుణాలను అధిక వడ్డీలకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ రుణాలు తీసుకొచ్చే అంశంలోనే గత పాలకులు అవకతవకాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
అంతేకాదు తుమ్మడిహట్ట దగ్గర నీళ్లు లేకపోవడం వల్లే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చినట్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పిన విషయం అబద్ధమని తెలిపారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆరే సూచించినట్లు పేర్కొన్నారు. అలాగే 2016లో కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీ కూడా మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దని చెప్పిందని తెలిపారు. కానీ కేసీఆర్ దీన్ని పట్టించుకోలేదని విమర్శించారు.
Telangana: కేసీఆర్‌పై చర్యలు ?.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
తెలంగాణలో కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌పై సీఎం రేవంత్ మాట్లాడారు. అవినీతి, పక్షపాతంతోనే ఈ ప్రాజెక్టును నిర్మించారంటూ మండిపడ్డారు.
CM Revanth
తెలంగాణలో కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌పై సీఎం రేవంత్ మాట్లాడారు. అవినీతి, పక్షపాతంతోనే ఈ ప్రాజెక్టును నిర్మించారంటూ మండిపడ్డారు. ''రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్లు మార్చేశారు. ప్రాజెక్టు నిర్మించిన మూడేళ్లలోపే మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవేళ్లను ప్రారంభించారు. అన్నారం, సుందిళ్లలో లోపాలు ఉన్నట్లు NDSA నివేదిక ఇచ్చింది. ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ లోపాలు ఉన్నట్లు తేలింది. అవినీతి, పక్షపాతంతోనే ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఎన్నికలకు ముందు దీనిపై విచారణ చేయిస్తామని మేనిఫెస్టోలో చెప్పాం.
Also Read: టీసీఎస్ ఉద్యోగి దీనపరిస్థితి.. ఆఫీస్ ముందే మూడు రోజులు! వైరలవుతున్న లెటర్
కమిషన్ ఛైర్మన్‌గా వ్యవహరించిన పీసీ ఘోష్ నిబద్ధత కలిగిన వ్యక్తి. కేసీఆర్, హరీష్ రావుతో పాటు అనేక మందిని ఘోష్ విచారించారు. 16 నెలల తర్వాత 665 పేజీల రిపోర్టు ఇచ్చారు. ఊరు, పేరు, అంచనాలు మార్చేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. అలా నిర్మించినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో కూడా చర్చిస్తాం. అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటాం. అందరి ఆమోదం మేరకు ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. ఇది రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు కాదు. కమిషన్ ఇచ్చిన నివేదికనే కేబినెట్‌లో చర్చించి ఆమోదించాం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కేసీఆర్‌ను అరెస్టు అవుతారనే అంశాన్ని ప్రస్తావించలేదు. అయితే అంతకుముందు కేసీఆర్ ఈ అంశంలో తాను అరెస్టయినా భయపడాల్సిన అవసరం లేదని పార్టీ నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: సీఎం రేవంత్ సొంత జిల్లాలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ ఐదుగురు నేతలు జంప్?