IBM Jobs: యువతకు ఐబీఎం బంపరాఫర్.. ఏఐలో 50 లక్షల మందికి ఉద్యోగాలు

ఏఐ వాడకం పెరగడంతో ఐబీఎం యువతకు వాటిపై శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. 2030 నాటికి భారతదేశంలోని 50 లక్షల మంది యువతకు కొత్త తరం టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

New Update
IBM

IBM

ప్రస్తుతం అంతా ఏఐ(ai) హవానే నడుస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను ఐబీఎం అప్‌డేట్ చేయనుంది. ఏఐ వాడకం పెరగడంతో ఐబీఎం యువతకు వాటిపై శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. 2030 నాటికి భారతదేశంలోని 50 లక్షల మంది యువతకు కొత్త తరం టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI), సైబర్ సెక్యూరిటీ (Cybersecurity), క్వాంటం కంప్యూటింగ్ (Quantum Computing) వంటి అంశాల్లో ఈ శిక్షణ ఇవ్వనుంది. అయితే డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఐబీఎం ఈ నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఐబీఎం భారత ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేయనుంది.

ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖోతో ఐబీఎం ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా కేంద్రాల ద్వారా ఈ శిక్షణా కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీనివల్ల టైర్-2, టైర్-3 నగరాల్లోని యువతకు కూడా ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగాలపైనే ఐబీఎం దృష్టి సారించింది. ఏఐ టూల్స్ వాడకం, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి అంశాల్లో ప్రాథమిక స్థాయి నుండి అడ్వాన్స్‌డ్ స్థాయి వరకు బోధిస్తారు. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న తరుణంలో డేటాను ఎలా భద్రపరచుకోవాలి, సైబర్ దాడులను ఎలా అడ్డుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తారు. భవిష్యత్ టెక్నాలజీగా పిలవబడే క్వాంటం రంగంలో యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని ఐబీఎం భావిస్తోంది.

సరైన నైపుణ్యాలు లేకపోవడం వల్ల..

దేశంలో అపారమైన మానవ వనరులు ఉన్నాయని, కాకపోతే సరైన నైపుణ్యం లేకపోవడం వల్ల చాలామంది వెనుకబడుతున్నారని ఐబీఎం ఇండియా, సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ యువత మధ్య ఉన్న డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు కేవలం థియరీ మాత్రమే కాకుండా, ప్రాక్టికల్ ప్రాజెక్టుల ద్వారా అనుభవం వచ్చేలా ఐబీఎం స్కిల్‌బిల్డ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఉచిత కోర్సులను కూడా అందిస్తున్నారు. ఈ శిక్షణ పొందిన యువతకు కేవలం ఐబీఎంలోనే కాకుండా, ఐటీ రంగంలోని ఇతర దిగ్గజ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలను కూడా ఈ శిక్షణలో భాగంగా నేర్పించనున్నారు. 

Advertisment
తాజా కథనాలు