/rtv/media/media_files/2026/01/28/amazon-2026-01-28-21-55-23.jpg)
Amazon cuts 16,000 jobs worldwide in latest round of layoffs
ప్రముఖ ఇకామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరోసారి భారీగా లేఆఫ్స్ ప్రకటించింది. 2025 అక్టోబర్‌లో 14 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా 16 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెటి ఈ విషయాన్ని వెల్లడించారు. 2023 తర్వాత ఇంతటి స్థాయిలో ఉద్యోగులను తీసివేయడం ఇదే మొదటిసారి. ఆ ఏడాది ఏకంగా 27 వేల మందికి అమెజాన్ లేఆఫ్‌లు ప్రకటించింది. ఈఏడా ప్రారంభంలోనే భారీ సంఖ్యలో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించడంతో టెక్ ఉద్యోగుల్లో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి.
Also Read: అజిత్ పవార్ మరణంపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
కార్పొరేట్ ఉద్యోగుల స్థానంలో జనరేటివ్ AIను వినియోగించాలని యోచిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. పలు డిపార్ట్‌మెంట్లను తగ్గించి, భాగస్వామ్యాన్ని పెంచడం, పాలన వ్యవస్థలను తొలగించే ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొంది. అయితే ఈ సంస్థలో ఏయే విభాగాల్లో లేఆఫ్స్ ఉంటాయనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: హెచ్ 1బీ వీసా దరఖాస్తులను ఆపేయండి..టెక్సాస్ గవర్నర్ కీలక నిర్ణయం
గతేడాది అక్టోబర్‌లో తీసుకొచ్చిన సంస్థాగత మార్పులు పూర్తయినట్లు బెత్ గలెటి అన్నారు. అంతేకాదు కొత్త రోల్‌ను వెతుక్కునేందుకు అమెరికా ఉద్యోగులకు 90 రోజుల గడువు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇలా కొత్త రోల్‌ను ఎంచుకోని వాళ్లకి రూల్స్ ప్రకారం ఇతర ప్రయోజనాలు అందిస్తామని తెలిపారు. ఈ మార్పులు చేస్తూనే వ్యూహాత్మక విభాగాల్లో నియామకాలు కొనసాగిస్తామని చెప్పారు.
Follow Us