/rtv/media/media_files/2026/02/05/cognizant-2026-02-05-15-23-30.jpg)
అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న టైమ్ లో కాగ్నిజెంట్ సంస్థ ఫ్రెషర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2026 సంవత్సరంలో సుమారు 24 వేల నుంచి 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 20 శాతం ఎక్కువ కావడం విశేషం.
కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఎస్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయాలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ఏఐ టూల్స్ సహాయంతో ఇప్పుడు కొత్తగా చేరే ఉద్యోగులు కూడా గతంలో అనుభవం ఉన్నవారు చేసే క్లిష్టమైన పనులను సులభంగా చేయగలుగుతున్నారని ఆయన తెలిపారు. ఈ టెక్నాలజీ వల్ల కంపెనీ ఉత్పాదకత పెరిగిందని, అందుకే ఎక్కువ మంది యువతను తీసుకోవాలని నిర్ణయించినట్లు వివరించారు.
💼 Companies Hiring Today:
— getoppty (@getoppty) February 5, 2026
Cognizant • Wipro • LTIM • Capgemini
Top roles:
• .Net Developer — Persistent (Hyderabad, Telangana, India)
...
• UI Architect — Persistent (Bengaluru, Karnataka, India)
Full list → https://t.co/esL6aQZKu0pic.twitter.com/HHKn1AApsR
బలోపేతం చేసే దిశగా అడుగులు
కంపెనీ తన టాలెంట్ పిరమిడ్ ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అంటే, అనుభవం ఉన్న వారిపైనే ఆధారపడకుండా, కింది స్థాయి నుంచే ప్రతిభావంతులైన ఫ్రెషర్లను తీసుకుని వారికి శిక్షణ ఇవ్వడం ఈ వ్యూహం ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఐఐటీ (IIT) వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి టాప్ టాలెంట్‌ను కూడా కంపెనీ రిక్రూట్ చేసుకోనుంది. అనుభవం కంటే కూడా కొత్త విషయాలను వేగంగా నేర్చుకునే అభ్యర్థులకే కంపెనీ మొదటి ప్రాధాన్యత ఇస్తోంది.
డిసెంబర్ త్రైమాసికంలో కాగ్నిజెంట్ తన నికర లాభంలో 18.7 శాతం వృద్ధిని సాధించింది. ఆదాయం కూడా గత ఏడాదితో పోలిస్తే పెరగడం కంపెనీ ధీమాను పెంచింది. గతేడాది నియమించుకున్న 20 వేల మందిలో ఇప్పటికే 16,000 మంది లైవ్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారని కంపెనీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ తెలిపారు. మిగిలిన 4 వేల మంది ఇప్పటికీ శిక్షణ పొందుతున్నారు.
Follow Us