CM Revanth: త్వరలో 40 వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నామని అన్నారు. బుధవారం హుజరాబాద్‌లో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
CM revanth

CM revanth

CM Revanth: సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నామని అన్నారు. బుధవారం హుజరాబాద్‌లో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2023 డిసెంబర్ 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. శ్రీకాంతాచారి బలిదానం కూడా అదేరోజు జరిగినట్లు గుర్తుచేశారు. ఆయన స్పూర్తితోనే 60 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండన్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు(Jobs) భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. 

Also Read: శబరిమల భక్తులకు గుడ్‌ న్యూస్‌..తెలంగాణ నుంచి పది ప్రత్యేక రైళ్లు.

''కాంగ్రెస్ పాలనలో కట్టిన SRSP ఎలా ఉందో ? బీఆర్‌ఎస్ కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలి. దేశవ్యాప్తంగా చూసుకుంటే మన రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నాం. రైతుల కోసం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశాం. వందలాది బస్సులకు ఆడబిడ్డలను యజమానులం చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. రూ.22,500 కోట్ల నిధులను పేదల ఇళ్ల కోసంఅందిస్తున్నాం. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో ప్రారంభించిన ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తయ్యాయి. 

Also Read: అప్పులు చెల్లించలేక అన్న పేరిట రూ.కోట్ల ఇన్సూరెన్స్‌.. ఆపై టిప్పర్‌తో తొక్కించి...

 హుస్నాబాద్‌ నియోజకవర్గంలో గత పాలనలో మొదలుపెట్టిన గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి కాలేదు. వాళ్లలా మేము నిర్లక్ష్యం చేసేది లేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని'' సీఎం రేవంత్ అన్నారు. ఈ సభలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, శ్రీధర్ బాబు, వివేక్ వెంకస్వామి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు 

Advertisment
తాజా కథనాలు