Artificial intelligence : ఈ ఏడాది AIతో ఈ 40 రకాల జాబ్స్ ఫసక్.. డేంజర్ లో ఉన్న ఉద్యోగాలివే.. షాకింగ్ రిపోర్ట్!

కృత్రిమ మేధస్సు లేదా AI ప్రస్తుతం అత్యంత వేగంగా మన జీవితంలో అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తోంది. ముఖ్యంగా వ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగాల రంగంలో దీని ప్రభావం రోజు రోజుకూ పెరుగుతోంది. 2026లో ఉపాధిపై AI ప్రభావం గురించి ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.

New Update
Artificial Intelligence

Artificial intelligence

Artificial intelligence : కృత్రిమ మేధస్సు లేదా AI ప్రస్తుతం నెమ్మదిగా కాకుండా..అత్యంత వేగంగా మన జీవితంలో అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తోంది. ముఖ్యంగా వ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగాల రంగంలో దీని ప్రభావం రోజు రోజుకూ పెరుగుతోంది. పని చేసే విధానం మారిపోతోంది. పనిని చేసే వ్యక్తులు మారిపోతున్నారు. 2026 లో ఉపాధిపై AI ప్రభావం గురించి ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. జియోఫ్రీ హింటన్ సత్య నాదెళ్లతో సహా ప్రముఖ వ్యక్తులు AI పురోగతి కారణంగా గణనీయమైన ఉద్యోగ నష్టాన్ని అంచనా వేస్తున్నారు.2026 లో AI మూలంగా నష్టపోయే 40 ఉద్యోగాలను మైక్రోసాఫ్ట్ జాబితా విడుల చేసింది.  

ఇటీవలి పరిణామంలో, మైక్రోసాఫ్ట్ AI ద్వారా విధ్వంసం జరిగే ప్రమాదం ఉన్న 40 ఉద్యోగాల జాబితాను విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ పరిశోధన దాని కోపైలట్ AI చాట్‌బాట్‌ద్వారా సుమారు 200,000 పైగా పనులపై పరిశోధన చేసి వాస్తవిక అంశాలను వెల్లడించింది. కార్యాలయంలో ఉత్పాదక AI ఇప్పటికే ఎక్కడ సమర్థవంతంగా ఉపయోగించబడుతుందో అక్కడ ఆయా ఉద్యోగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని తేలింది. అయితే, పరిశోధకులు 'AI వర్తించే స్కోరు' ఆధారంగా వృత్తుల ర్యాంకింగ్‌లో ఫలితాలను పంచుకున్నారు, ప్రతి ఉద్యోగం యొక్క ప్రధాన పనులను AI ఎంత బాగా నిర్వహించగలదో అంచనా వేశారు. అధ్యయనం ప్రకారం, భాష, విశ్లేషణ, సమాచార ప్రాసెసింగ్‌పై ఎక్కువగా ఆధారపడిన అన్ని ఉద్యోగాలు AI ప్రభావానికి ఎక్కువగా గురవుతాయని తేల్చారు.

ముఖ్యంగా పునరావృత పనులకు అవసరమైన మానవ శక్తి ఇప్పుడు యంత్రాల ద్వారా భర్తీ అవుతోంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించిన ఆటోమేషన్ ఇప్పుడు వాస్తవంగా మన ఉద్యోగాలను ప్రభావితం చేయడం ప్రారంభించింది. ఇటీవల నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ (NFER) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాబోయే పదేళ్లలో ప్రత్యేకంగా 2035 నాటికి సుమారు మూడు మిలియన్ల తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు అంతరించిపోయే అవకాశం ఉంది అని అంచనా వేసింది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థలో 2.3 మిలియన్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని కూడా ఈ నివేదిక పేర్కొంది.  

ఈ నివేదిక ప్రకారం.. ప్రత్యేకంగా మానవ శక్తిపై ఆధారపడే, పునరావృత పనులను కలిగిన ఉద్యోగాలే ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొంటాయి. ఉదాహరణకు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, మెషిన్ ఆపరేటర్లు, క్యాషియర్లు, గిడ్డంగి కార్మికులు, రూఫింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వంటి వృత్తుల్లో పనిచేసే వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. యంత్రాలు మరింత ఖచ్చితత్వంతో, తక్కువ ఖర్చుతో, నిరంతరం పనిచేయగలుగుతున్నందున, సంస్థలు మానవ శక్తిని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి.  ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగం, నిర్వహణ, ఇంజినీరింగ్, శాస్త్ర పరిశోధనలు, మానసిక వైద్య శాస్త్రం వంటి రంగాల్లో పనులు పెరుగుతాయి. కానీ ఈ రంగాల్లో కూడా ప్రాథమిక స్థాయి ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల తగ్గే అవకాశమున్నట్లు నివేదిక సూచించింది. 

 AI ప్రభావానికి గురయ్యే ఉద్యోగాలు
వ్యాఖ్యాతలు,అనువాదకులు
చరిత్రకారులు
ప్రయాణీకుల సహాయకులు
సేవల అమ్మకాల ప్రతినిధులు
రచయితలు మరియు కవులు
కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు
CNC టూల్ ప్రోగ్రామర్లు
టెలిఫోన్ ఆపరేటర్లు
టికెట్ ఏజెంట్లు, ట్రావెల్ క్లర్కులు
ప్రసార ప్రకటనదారులు మరియు రేడియో DJలు
బ్రోకరేజ్ క్లర్కులు
వ్యవసాయ,గృహ నిర్వహణ అధ్యాపకులు
టెలిమార్కెటర్లు
ద్వారపాలకులు
రాజకీయ శాస్త్రవేత్తలు
వార్తా విశ్లేషకులు, రిపోర్టర్లు,జర్నలిస్టులు
గణిత శాస్త్రజ్ఞులు
సాంకేతిక రచయితలు
ప్రూఫ్ రీడర్లు, కాపీ మార్కర్లు
హోస్ట్‌లు, హోస్టెస్‌లు
సంపాదకులు
బిజినెస్ టీచర్లు, పోస్ట్ సెకండరీ
ప్రజా సంబంధాల నిపుణులు
ప్రదర్శనకారులు,ఉత్పత్తి ప్రమోటర్లు
ప్రకటనల అమ్మకాల ఏజెంట్లు
కొత్త అకౌంట్స్ క్లర్కులు
గణాంక సహాయకులు
కౌంటర్,అద్దె క్లర్కులు
డేటా శాస్త్రవేత్తలు
వ్యక్తిగత ఆర్థిక సలహాదారులు
ఆర్కైవిస్టులు
ఎకనామిక్స్ టీచర్లు, పోస్ట్ సెకండరీ
వెబ్ డెవలపర్లు
నిర్వహణ విశ్లేషకులు
భౌగోళిక శాస్త్రవేత్తలు
మోడల్స్
మార్కెట్ పరిశోధన విశ్లేషకులు
ప్రజా భద్రత టెలికమ్యూనికేటర్లు
స్విచ్‌బోర్డ్ ఆపరేటర్లు
లైబ్రరీ సైన్స్ టీచర్లు, పోస్ట్ సెకండరీ

Advertisment
తాజా కథనాలు