/rtv/media/media_files/2026/02/05/anthropic-2026-02-05-09-24-25.jpg)
Anthropic
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పటి వరకు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఒక సాఫ్ట్‌వేర్ గుర్తు వచ్చేది. కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన ‘ఆంథ్రోపిక్’ అనే సంస్థ ఆవిష్కరించిన ‘క్లాడ్ కోవర్క్’ అనే కొత్త టూల్ ప్రపంచ టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఐటీ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అసలు ఈ క్లాడ్ కోవర్క్ అంటే ఏమిటి? ఇది ఐటీ రంగాన్ని ఎలా ప్రభావితం చేయబోతోందనే విషయాలు తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: U19 World Cup 2026: ఆఫ్ఘన్‌ను ఊడ్చేసిన భారత కుర్రాళ్లు.. ఫైనల్లో భారత్ vs ఇంగ్లాండ్!
11 రకాల కొత్త ప్లగిన్‌లు..
మనం ప్రస్తుతం వాడుతున్న చాట్‌జీపీటీ లేదా జెమిని వంటివి కేవలం మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాయి. కానీ క్లాడ్ కోవర్క్ అలా కాదు.. డిజిటల్ ఉద్యోగిగా వర్క్ చేస్తుంది. దీనికి ఒక పని అప్పగిస్తే అది స్వయంగా కంప్యూటర్ ఫోల్డర్లను ఓపెన్ చేస్తుంది. దానికి అవసరమైన ఫైళ్లను వెతుక్కుని వాటిని మార్చుతుంది. అంటే ఇతరులు చెప్పకుండా తన పని తానే చేసుకుంటుంది. అయితే ఆంథ్రోపిక్ సంస్థ ఈ ప్లాట్‌ఫామ్‌లో 11 రకాల కొత్త ప్లగిన్‌లను ప్రవేశపెట్టింది. ఇవి వివిధ వృత్తుల్లో నిపుణులు చేసే పనులను చిటికెలో చేస్తాయి. లీగల్ ప్లగిన్, ఫైనాన్స్ ప్లగిన్, డేటా అనాలసిస్, బయో రీసెర్చ్ వంటి వర్క్స్ అన్ని చేస్తుంది. ఇది సాఫ్ట్‌వేర్ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఇది కూడా చూడండి: Donald Trump : నీ ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉండదు.. జర్నలిస్టుపై ట్రంప్ ఫైర్!
దేశంలోని ఐటీ కంపెనీలకు అమెరికా, ఐరోపా దేశాల నుంచి వచ్చే ‘ఔట్‌సోర్సింగ్’ ప్రాజెక్టులే ప్రధాన ఆదాయ వనరు. మన కంపెనీలు ‘బిల్లబుల్ హవర్స్’ అనే పద్ధతిపై క్లయింట్ల నుంచి డబ్బులు తీసుకుంటాయి. ఇప్పుడు క్లాడ్ వంటి ఏఐ టూల్స్ వల్ల పది మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు చేసే కోడింగ్ లేదా టెస్టింగ్ పనులను ఒక్కరే పూర్తి చేసే అవకాశం ఉంది. దీనివల్ల విదేశీ క్లయింట్లు మన కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టులు తగ్గించవచ్చు లేదా తక్కువ డబ్బులు చెల్లించవచ్చు. ఇది మన ఐటీ కంపెనీల ఆదాయాన్ని, లాభాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
ఇది కూడా చూడండి: Mahesh kumar Goud : పవన్ ఆంధ్ర నాయకుడు.. తెలంగాణ వ్యతిరేకి: మహేష్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్
భవిష్యత్తు, ఉద్యోగ భద్రత క్లాడ్ కోవర్క్ ప్రభావం ఐటీ ఉద్యోగ మార్కెట్‌పై కూడా తీవ్రంగా ఉండనుంది. కేవలం సాధారణ కోడింగ్, టెస్టింగ్ మాత్రమే చేసే ఉద్యోగులకు భవిష్యత్తులో గిరాకీ తగ్గొచ్చు. అయితే ఏఐని సమర్థవంతంగా వాడుకుంటూ.. క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు చూపే ‘కన్సల్టింగ్’ నిపుణులకు మాత్రం అవకాశాలు పెరుగుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Follow Us