Gaza : గాజాలో ఆగని మృత్యుఘోష...ఇజ్రాయెల్ దాడుల్లో 32 మంది మృతి
గాజా నగరంపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. డ్రోన్లు, వైమానిక దాడులతో చెలరేగిపోతుంది. తాజాగా గాజాలోని పలు ప్రాంతాలపై ఐడీఎఫ్ దళాలు చేసిన దాడుల్లో 32 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.