/rtv/media/media_files/2025/08/07/gaza-2025-08-07-20-02-39.jpg)
Move Population, Bomb City, Inside Netanyahu's Gaza New Plan, know Details
హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ప్రజలు తిండిలేక ఆకలితో చనిపోతున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మానవతా సాయ పంపిణీ కేంద్రాలను కూడా టార్గెట్ చేసుకొని దాడులు జరుపుతోంది. ఈ దాడుల్లో ఇప్పటిదాకా వెయ్యి మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా చేసుకుంది. అక్కడి స్థానిక మీడియా ఈ విషయాలు వెల్లడించింది. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు దశలవారీగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని పేర్కొంది. మరో 5 నెలల్లోనే ఈ ప్రాంతాన్ని తన సొంతం చేసుకునేలా అడుగులు వేస్తోందని వెల్లడించింది.
Also Read: ఇండియా-పాక్ సీజ్‌ఫైర్ ట్రంప్ సుంకాలకు మధ్య లింక్?.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ దేశ సెక్యూరిటీ కేబినెట్ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. గాజాపై తదుపరి కార్యచరణ గురించి చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదిలాఉండగా ఇజ్రాయెల్ మిలటరీ బుధవారం గాజాలోని ఉత్తర, ఖాన్ యూనిస్‌లోని ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఇజ్రాయెల్ గాజాను స్వాధీనం చేసుకోనుందని.. స్థానికులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోవాలని చెప్పింది. అంతేకాదు గ్రౌండ్ ఆపరేషన్లను కూడా విస్తరించనున్నట్లు మిలటరీ అధికార ప్రతినిధి తెలిపారు.
ఇజ్రాయెల్ వ్యూహం ఇదే
ఇజ్రాయెల్ గత కొన్ని నెలలుగా హమాస్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు గాజాపై దాడులు చేస్తోంది. కానీ దాని లక్ష్యాలు ఇంకా నెరవేరడం లేదు. అందుకే ఓ కీలక వ్యూహాన్ని అమలు చేయనుంది. ముందుగా గాజా పట్టణాన్ని మొత్తం తన అధీనంలోకి తీసుకోవాలని భావిస్తోంది. ఆ తర్వాత ఆహార పంపిణీ కేంద్రాలను పెద్ద ఎత్తున పెంచాలని చూస్తుంది. సాధారణ ప్రజలందరూ సాయం కోసం ఒక చోటుకి వచ్చాక.. మిగతా ప్రాంతాల్లో బాంబులతో దాడులు చేయాలని యోచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా తొలివిడతగా దాదాపు 10 లక్షల మందికి ఖాళీ చేయాలని హెచ్చరికలు పంపనున్నారు. అప్పుడు గాజా స్ట్రిప్‌లో సగభాగం ఖాళీ అవుతుంది. అయితే వీళ్లందరికీ సెంట్రల్ గాజాలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.
Also Read: ఐర్లాండ్ లో మితిమీరిన జాత్యాహంకారం..ఆరేళ్ల ఇండియన్ బాలిక ప్రైవేట్ పార్ట్ లపై దాడి
ఇక రెండో విడతగా సాధారణ ప్రజలు ఖాళీ చేసినటువంటి ప్రాంతాల్లో మిలటరీ ఆపరేషన్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మూలల్లో దాక్కుండే హమాస్ ఉగ్రవాదులను హతం చేయాలనేది ఇజ్రాయెల్ ప్లాన్. ప్రస్తుతం హమాస్ అదుపులో 50 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. వీళ్లందరూ గాజా ఉత్తర ప్రాంతంలోనే ఉన్నారని IDF భావిస్తోంది. ఒకవేళ ఆ ప్రాంతంలో సైనిక చర్యలు చేపడితే తమ దేశ పౌరుల ప్రాణాలకు కూడా ముప్పు ఉందని ప్రభుత్వానికి చెప్పింది. కాబట్టి ప్రధాని నెతన్యాహు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మరో ప్లాన్
ఇక మరో ప్లాన్ ఏంటంటే అమెరికా మధ్యవర్తిత్వంతో హమాస్‌తో చర్చలు జరుపుతుంది. అవి సక్సెస్ అయితే ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు నిలిపివేసే ఛాన్స్ ఉంటుంది. కానీ దీనికి నెతన్యాహు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ గాజాను ముట్టడి చేసి.. ఆ ప్రాంతాలకు సాయాన్ని నిలిపివేసే ఛాన్స్‌ను కూడా ఇజ్రాయెల్ పరిశీలిస్తోంది. కానీ దీనికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఇది జరగకపోవచ్చు.