Iran: ఇరాన్‌కు షాక్.. మరో కీలక శాస్త్రవేత్త మృతి
ఇరాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన మరో కీలకమైన అణు శాస్త్రవేత్త సయ్యద్ మహమ్మద్ రెజా సిద్దఘీ సాబెర్ ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందాడు. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇరాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన మరో కీలకమైన అణు శాస్త్రవేత్త సయ్యద్ మహమ్మద్ రెజా సిద్దఘీ సాబెర్ ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందాడు. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే ఇరాన్ దీన్ని ఉల్లంఘించి తమపై మిసైల్స్‌తో దాడులు చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. తాము గట్టిగా బదులిస్తామని హెచ్చరించింది.
గత 12 రోజులుగా కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. అమెరికా ప్రతిపాదనతో ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. ముందుగా ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించగా.. తాజాగా ఇజ్రాయెల్ కూడా సీజ్‌ఫైర్‌కు అంగీకరించింది.
మూడేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా.. ఉక్రెయిన్‌పైకి ఏకంగా 350కి పైగా డ్రోన్లు, 11 క్షిపణులతో దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
ఇరాన్ మిత్రదేశమైన చైనా.. అమెరికా దాడుల విషయంలో వెనక్కి తగ్గింది. ఈ దాడులను కేవలం మాటలతో విమర్శించింది. కానీ ఇరాన్‌కు సైనిక మద్దతు ఇచ్చే అంశం గురించి మాత్రం చైనా మాట్లాడలేదు. దీన్ని బట్టి చూస్తే చైనా.. ఇరాన్‌కు హ్యాండ్ ఇచ్చినట్లే కనిపిస్తోంది.
హార్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల భారత్‌తో పాటు ఇతర దేశాలకు నష్టం వాటిల్లనుంది. భారత్‌లో చమురు ధరలు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరగనుంది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ప్రయత్నాలు చేయాలని మోదీ కోరారు.
ఇరాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్‌రియారీ హతమయ్యారు. ఈ విషయాన్ని IDF ప్రకటించింది.