/rtv/media/media_files/2025/10/28/pakistan-troops-to-be-sent-to-gaza-in-post-war-stabilisation-mission-2025-10-28-15-49-17.jpg)
Pakistan Troops To Be Sent To Gaza In Post-War Stabilisation Mission
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే గాజాలో పాకిస్థాన్ తమ సైన్యాన్ని మోహరించేందుకు సిద్ధమైంది. శాంతి ఒప్పందంలో అంతర్జాతీయ దళాల్లో (ISF) భాగంగా వివిధ దేశాలు తమ దళాలను గాజాకు పంపనున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కూడా తమ బలగాలను అక్కడికి పంపించనుంది. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్, ఇజ్రాయెల్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్, ఈజిప్టులోని అమెరికాకు చెందిన CIA సీనియర్ అధికారుల మధ్య రహస్య సమావేశాలు జరిగాయి.
Also Read: నవంబర్ 1 నుంచి.. ఢిల్లీలో వాహనాలకు నో ఎంట్రీ!
ఈ నేపథ్యంలోనే పాక్ సైనికులను గాజాలో మోహరించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20 వేల మంది సైనికులను అక్కడికి పంపించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పాక్ నుంచి అధికార ప్రకటన త్వరలో రానుంది. అయితే పాక్ సైన్యం గాజాలో అంతర్గత భద్రతను కట్టుదిట్టం చేస్తాయి. అలాగే మానవతా సాయం అందిస్తాయి. పునర్నిర్మాణ సేవలు చేస్తాయి. అంతేకాదు హమాస్‌ను ఆయుధరహితంగా మార్చడంలో సరిహద్దుల్లో భద్రత బాధ్యతలు చేపట్టనున్నాయి.
Also Read: వెళ్ళినా, వచ్చినా కూడా ఫోటోలు, బయో మెట్రిక్..యూఎస్ కొత్త రూల్ అమల్లోకి..
అంతేకాదు ఇజ్రాయెల్, గాజాలో మిగిలిన మిలిటెంట్ వర్గాల మధ్య పాక్ దళాలు బఫర్ ఫోర్స్‌గా పనిచేస్తాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇలా మోహరించినందుకు బదులుగా ఇజ్రాయెల్, అమెరికా నుంచి పాకిస్థాన్‌కు ఆర్థిక ప్రోత్సహకాలు రానున్నాయని సమాచారం. అయితే పాక్ సైన్యం ప్రమేయం ఈ విషయంలో సున్నితమైనదని.. వ్యూహాత్మకంగా ప్రయోజనం ఏం ఉండదని ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి శాంతి కార్యకలాపాలకు ఎక్కువగా దళాలను పంపించే దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉంది. ఐరాస.. ఆసియా, ఆఫ్రికా అంతటా తమ కార్యకలాపాలకు 2 లక్షల కంటే ఎక్కువ దళాలను ఇప్పటికే మోహరించింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వచ్చే ఆర్థిక ప్రోత్సహకాల కోసమే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: 6.0 తీవ్రతతో టర్కీలో భూకంపం..ఇస్తాంబుల్ లో కూలిన భవనాలు
Follow Us