/rtv/media/media_files/2025/10/31/man-2025-10-31-19-30-35.jpg)
Canadian court sentences Indian-origin man to 25 years' imprisonment for 2022 Murder case
కెనడాలో ఉంటున్న ఓ భారత సంతతి వ్యక్తికి బిగ్ షాక్ తగిలింది. అక్కడి కోర్టు అతడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ హత్య కేసుకు సంబంధించి ముగ్గురు దోషులుగా తేలారు. ఇప్పటికే ఇద్దరు యువకులకు 17 ఏళ్ల చొప్పున శిక్ష ఖరారు చేశారు. అయితే తాజాగా భారత సంతతి వ్యక్తి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
Also Read: గుడ్‌న్యూస్.. భారత్‌లో టెస్లా, స్టార్‌లింక్ ఉద్యోగాలు..
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2022 అక్టోబర్ 17న వాంకోవర్‌లోని గోల్ఫ్ క్లబ్‌లో విశాల్ వాలియా అనే వ్యక్తి కారులో వెళ్తున్నాడు. ఈ సమయంలోనే అతడిని నిందితులు కాల్చి చంపారు. ఆ తర్వాత విశాల్ కారును తగలబెట్టారు. అనంతరం దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భారత సంతతికి చెందిన బాలరాజ్ సింగ్ బాస్రాతో సహా ఇక్బాల్ కాంగ్, డియాండ్రే బాప్టిస్ట్ ఈ హత్యకు పాల్పడ్డట్లు విచారణలో తేలింది.
Also Read: వేలంలో మొఘల్ కాలం నాటి పేయింటింగ్ రికార్డ్.. రూ.120 కోట్లు
సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు వాహనాన్ని తగలబెట్టినట్లు బయటపడింది. ఈ క్రమంలోనే బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు బస్రాతో సహా ముగ్గురిని ఈ హత్య కేసులో దోషులుగా తేల్చింది. మరోవైపు హత్యకు గురైన విశాల్‌కు కూడా చాలా నేరాలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది.
Follow Us