/rtv/media/media_files/2025/10/27/flight-2025-10-27-14-40-30.jpg)
Over 8,000 US Flights Delayed Amid Government Shutdown
అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో విమాన సర్వీసులపై భారీగా ఎఫెక్ట్ పడింది. అక్కడ ఆదివారం దాదాపు 8 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. చాలాచోట్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు హాజరుకాలేదు. దీంతో వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన 22 ప్రాంతాల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలో సిబ్బంది కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని అమెరికా రవాణా మంత్రి శాన్‌డఫీ వెల్లడించారు.
Also Read: పరువు తీశారు కదరా.. విదేశీ యూట్యూబర్‌ను పేడలో ముంచిన భారతీయులు
అంతేకాదు రాబోయే రోజుల్లో సిబ్బంది కొరత ఇంకా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని.. దీనివల్ల విమానాల ఆలస్యం కావడం అలాగే సర్వీసులు రద్దు కావడం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అమెరికా కాలమాన ప్రకారం చూసుకుంటే ఆదివారం రాత్రి 11 గంటలకు దాదాపు 8 వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అక్కడి లోకల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో 2 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1200, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 739, అలాగే డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 600 విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. మరోవైపు లాస్ ఏంజెలెస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కూడా సిబ్బంది కొరత వల్ల విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. దాదాపు రెండు గంటల పాటు ఆ ఎయిర్‌పోర్టుకు విమానాలను పంపించలేదు. న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులలో కూడా ఈ సమస్య నెలకొన్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అధికారులు చెప్పారు.
Also Read: ఢిల్లీలో ఘోరం..ఆర్మీ అధికారినని నమ్మించి డాక్టర్‌పై లైంగికదాడి
ఇదిలాఉండగా అమెరికాలో అక్టోబర్ 1 నుంచి షట్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనివల్ల దాదాపు 13 వేల మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, 50 వేల మంది ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఎలాంటి జీతం లేకుండానే పని చేయాలనే ఆదేశాలు జారీ చేశారు. కానీ కొందరు ఏటీసీ సిబ్బంది విధులకు రాకపోవడంతో విమానాలకు ఆటంకం ఏర్పడుతోంది.
Follow Us