/rtv/media/media_files/2025/11/05/mexico-2025-11-05-15-56-08.jpg)
Man gropes, tries to kiss Mexican President in public
మెక్సికోలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షురాలికే నడిరోడ్డుపై లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. మెక్సిసో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ మంగళవారం ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ప్రజలతో మాట్లాడుతోంది. ఈ క్రమంలోనే వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమెపై చేయి వేస్తూ ముద్దు పెట్టుకోబోయాడు.
Also Read: మరో దారుణం.. మహిళల హాస్టల్ టాయిలెట్‌లో స్పై కెమెరాలు
అలాగే ఆమె ఛాతీ భాగాన్ని ముట్టుకోబోయాడు. దీంతో వెంటనే అధ్యక్షురాలి భద్రతా సిబ్బంది అతడిని పక్కకు నెట్టి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
CRAZY moment man GROPES Mexico’s President Claudia Sheinbaum
— RT (@RT_com) November 4, 2025
Then TRIES to kiss her before security finally wakes up
How was security THIS slow to react? pic.twitter.com/vaECXy0bCW
Follow Us