/rtv/media/media_files/2025/10/27/bangladesh-2025-10-27-15-53-19.jpg)
Yunus gifts map to Pak general showing India's Northeast in Bangladesh
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి బరితెగించారు.. భారత భూభాగాన్ని బంగ్లాదేశ్‌కు చెందినట్లుగా చూపిస్తూ ఓ వివాదాస్పద మ్యాప్‌ను విడుదల చేశారు. దాన్ని పాకిస్థాన్ జనరల్ షంషాద్ మీర్జాకు బహుమతిగా ఇచ్చారు. ఆ మ్యాప్‌లో ఏడు భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో ఉన్నట్లుగా చూపించారు.
Also Read: పరువు తీశారు కదరా.. విదేశీ యూట్యూబర్‌ను పేడలో ముంచిన భారతీయులు
ఇక వివరాల్లోకి వెళ్తే.. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయక యూనస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు దగ్గరవుతున్నాయి. అయితే ఇటీవల పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్‌పర్సన్ జనరల్ షంషాద్ మీర్జా బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయన యూనస్‌తో సమావేశమయ్యారు. దీంతో మీర్జాకు యూనస్ ‘Art of Triumph’ పేరుతో ఉన్న ఓ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ పుస్తకం కవర్ పేజీపై వక్రీకరించిన బంగ్లాదేశ్ మ్యాప్ ఉంది. అందులో ఏడు భారత ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mohammad Yunus gifts Pakistan General a Bangladesh map showing India’s Assam and Northeast as part of it pic.twitter.com/5yzT0mwzl9
— IndiaWarMonitor (@IndiaWarMonitor) October 26, 2025
అయితే ఈశాన్య ప్రాంతలపై యూనస్ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఆయన చైనాలో పర్యటించారు. ఆ సమయంలో మాట్లాడుతూ.. '' భారత ఈశాన్య ప్రాంతంలో ఉన్న 7 రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అని పిలుస్తారు. అవి బంగ్లాదేశ్‌లో భాగమై ఉన్నాయి. వాళ్లు సముద్రానికి చేరుకునేందుకు వేరే రూట్ లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే రక్షకులం. చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించుకునేందుకు అనుకూలంగా ఉంటుందని'' పేర్కొన్నారు.
Also Read: మరో భారీ అగ్నిప్రమాదం.. రెస్టారెంట్‌లో 4 గ్యాస్ సిలిండర్‌లు బ్లాస్ట్ - ఒకరు స్పాట్ డెడ్
యూనస్ వ్యాఖ్యలకు భారత్ కూడా కౌంటర్ ఇచ్చింది. '' బంగాళఖాతంలో భారత్‌కు 6500 కిలోమీటర్ల పొడవైన తీర రేఖ ఉంది. 5 బిమ్‌స్టెక్ సభ్య దేశాలతో భారత్‌కు సరిహద్దు ఉంది. మా ఈశాన్య ప్రాంతం బిమ్‌స్టెక్ కెనెక్టివిటీ హబ్‌గా అభివృద్ధి అవుతోంది. రైల్వేలు, రోడ్లు, జలమార్గాలు, పైప్‌లైన్, గ్రిడ్ నెట్‌వర్క్‌లతో ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం వరకు లింక్ అవుతోందని'' భారత విదేశాంగ శాఖ బంగ్లాకు గట్టి కౌంటర్ ఇచ్చింది.
Follow Us