/rtv/media/media_files/2025/11/09/asim-munir-2025-11-09-16-31-51.jpg)
Pak Amends Constitution, Gives Asim Munir Key Role After Op Sindoor Drubbing
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు అక్కడి ప్రభుత్వం మరిన్ని అధికారులు కట్టబెట్టనుంది. త్రివిధ దళాలను ఏకీకృత కమాండ్ కిందకి తీసుకొచ్చేలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే కొత్త పోస్టును ఏర్పాటు చేసింది. దీనికోసం రాజ్యాంగ సవరణను చేపట్టారు. ఈ మేరకు 27వ రాజ్యాంగ సవరణ బిల్లును శనివారం సెనెట్‌లో ప్రవేశపెట్టింది. ఆర్మీ చీఫ్‌ను, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌ను ప్రధాని సిఫార్సు మేరకు దేశ అధ్యక్షుడు నియమిస్తారు. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రధానమంత్రితో చర్చలు జరిపిన అనంతరం నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అధిపతిని నియమిస్తారు.
Also Read: బీజేపీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు.. అత్యాచారం, కిడ్నాప్ సెక్షన్లు!
ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ దళాల సమన్వయం కోసం CDF అధిపతిగా ఉంటారు. అయితే నవంబర్ 28న అసిమ్ మునీర్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే మునీర్‌కు కొత్తగా సృష్టిస్తున్న CDF బాధ్యతలు అప్పగించనున్నట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మునీర్‌కు ఈ అధికారాలు వస్తే పాక్ సైన్యంపై ఆయనకు మరింత పవర్ రానుంది.
Also read: సంచలన నిర్ణయం.. ఆ దేశంలో పిల్లలు సోషల్ మీడియా వాడటం నిషేధం..
ఇదిలాఉండగా ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత భారత్ ఆఫరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీవోకే ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. అయితే పాక్ ఇప్పుడు తన సైన్యంపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రభుత్వం ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి కల్పించింది. దీనివల్ల మునీర్ పాక్ చరిత్రలో ఈ పదవి తీసుకున్న రెండవ అత్యున్నత సైనికాధికారిగా నిలిచారు.
Also Read: రాత్రికి రాత్రే కూరగాయల వ్యాపారి కుబేరుడయ్యాడు..ఎలా అంటే?
Follow Us