China: అంతరిక్షంలో అద్భుతం.. స్పేస్ స్టేషన్‌లో వంట చేసిన వ్యోమగాములు

స్పేస్‌లో కూడా వండిన పదార్థాలు తినొచ్చని చైనాకు చెందిన వ్యోహగాములు నిరూపించారు. స్పేస్‌ స్టేషన్‌లో వాళ్లు చికెన్‌ వింగ్ వండుకొని తిన్నారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
China Introduces First-Ever BBQ Oven At Space Station

China Introduces First-Ever BBQ Oven At Space Station

అంతరిక్షంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇప్పటిదాకా వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ (ISS)లో  కేవలం నిల్వ ఉంచిన పదార్థాలను మాత్రమే తినేవారు. కానీ  స్పేస్‌లో కూడా వండిన పదార్థాలు తినొచ్చని చైనాకు చెందిన వ్యోహగాములు నిరూపించారు. స్పేస్‌ స్టేషన్‌లో వాళ్లు చికెన్‌ వింగ్ వండుకొని తిన్నారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. చైనా తన టియాంగాంగ్‌ స్పేస్ స్టేషన్‌లో మొదటిసారిగా బార్బెక్యూ ఓవెన్‌ను ప్రవేశపెట్టింది.

Also Read: ట్రంప్ బిగ్‌ షాక్‌.. డయాబెటీస్, ఒబెసిటి ఉంటే అమెరికాకు నో ఎంట్రీ

వీడియోలో వ్యోమగాములు కోడి రెక్కలను కాల్చుకొని తీనడం చూడొచ్చు. అంతరిక్షంలో మొదటిసారిగా ఇలా వండుకొని తినడం ఓ మైలురాయని నిపుణులు భావిస్తున్నారు. అంతరిక్షంలో గ్రావిటీ ఉండదన్న సంగతి తెలిసిందే. అయితే జీరో గ్రావిటీలో కూడా పనిచేసే ఓవెన్‌ను చైనా తమ టియాంగాంగ్‌ స్టేస్ స్టేషన్‌కు పంపించింది. కొన్ని దశాబ్దాలుగా వ్యోమగాములు నిల్వఉన్న ఆహారాన్ని మాత్రమే తినేవారు. ఇప్పుడు తాజాగా ఓవెన్‌లో కాల్చిన ఆహారాన్ని కూడా తినేలా చైనా వ్యోమగాములు సరికొత్త శ్రీకారం చుట్టారు. 

Also Read: బాంబులు పెట్టానంటూ బెదిరింపు కాల్స్‌.. కట్‌ చేస్తే విఫల ప్రేమికురాలు

అంతరిక్షంలో ఇలాంటి వినూత్న ప్రయోగం చేయడంతో చైనా వ్యోమగాములపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వ్యోమగాముల జీవన నాణ్యతను మెరుగుపర్చడంలో ఇది కూడా ఓ ముఖ్యమైన భాగమని నిపుణులు అంటున్నారు. ఇక రాబోయో రోజుల్లో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తాజాగా వండిన ఆహారాన్ని తినే సౌకర్యం లభించనుంది.  

Advertisment
తాజా కథనాలు