/rtv/media/media_files/2025/10/27/pakistan-2025-10-27-18-22-25.jpg)
Tensions Rise Over Pakistan Army Chief' Asim Munir Extension
Pakistan: పాకిస్థాన్‌లో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, సైన్యానికి మధ్య వివాదం తీవ్రతరమైంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునిర్ పదవీకాలం 2027 వరకు పొడిగించబడిందని.. దీనికి కొత్త ఆర్డర్ అవసరం లేదని ప్రభుత్వం అంటోంది. కానీ మునీర్ ఇప్పుడు 2025 నుంచి 2030 వరకు ఇంకా ఐదేళ్లు పొడిగింపును కోరుకుంటున్నారు. నిఘా వర్గాల ప్రకారం కేవలం సర్వీసు పొడిగింపు గురించి కాదని.. అధికార నియంత్రణకు సంబంధించినదని తెలుస్తోంది. అయితే మునీర్‌కు ఐదేళ్ల పదవీకాలం పొడిగిస్తే అతడు రాజకీయ వ్యవస్థపై ఆధిపత్యం చెలాయిస్తాడని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) PML (N) పార్టీ భావిస్తోంది.
Also read: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన.. 12 రాష్టాల్లో SIR
మరోవైపు మునీర్‌కు పలు విదేశాల నుంచి, ఖతార్ నుంచి సపోర్ట్ లభిస్తోంది. పాక్ ప్రభుత్వానికి, మునీర్‌కు మధ్య వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ఖతార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పాక్ సైన్యంలో కూడా మునీర్‌కు పెద్దగా వ్యతిరేకత లేనట్లు కనిపిస్తోంది. ఆయన తనకు దగ్గరగా ఉండే అధికారులకు కీలక పదవులు అప్పగించడమే దీనికి కారణమని సమాచారం.
Also Read: ఢిల్లీలో ఘోరం..ఆర్మీ అధికారినని నమ్మించి డాక్టర్‌పై లైంగికదాడి
ఇక పాక్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISI కూడా అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపేందుకు తెహ్రీక్-ఇ-లబ్బాయిక్-పాకిస్థాన్ (TLP) పార్టీ శ్రేణులను వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టేలా ISI కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అంతేకాదు షాబాజ్ షరీఫ్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ ISI ఓ పౌరుడి ద్వారా పిటిషన్ దాఖలు చేయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తానికి అధికార ప్రభుత్వం, మునీర్ నేతృత్వంలో సైన్యం మధ్య తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: బరితెగించిన యూనస్.. బంగ్లాదేశ్ మ్యాప్‌లో భారత ఈశాన్య రాష్ట్రాలు..
Follow Us