సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళనలు.. స్పందించిన ఆస్ట్రోనాట్
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న నాసా వ్యోమగామి ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ ఆమె మరోసారి స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేస్తూ ఓ ఫొటోను విడుదల చేశారు. కొద్దిరోజుల క్రితం బక్కచిక్కిన ముఖంతో కనిపించగా ఇప్పుడు ఆమె ఆరోగ్యం కుదుటపడినట్లు తెలుస్తోంది.