/rtv/media/media_files/2025/07/28/six-dead-in-mass-shooting-at-popular-bangkok-food-market-2025-07-28-14-34-29.jpg)
Six dead in mass shooting at popular Bangkok food market
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో దారుణం జరిగింది. ఓ దుండగుడు అక్కడి స్థానికులపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఆ తర్వాత దుండగుడు కూడా తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ దాడికి సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు. అక్కడి స్థానిక మీడియా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్యాంకాక్‌లోని ఓర్ టు కో మార్కెట్‌లో ఓ సాయుధుడు చొరబడ్డాడు.
Also Read: ఛీ ఛీ.. గబ్బిలాలతో చిల్లీ చికెన్ - రాష్ట్రంలో బయటపడ్డ మోసం
తన వద్ద తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఓ మహిళ మృతి చెందారు. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చతుచక్ మార్కెట్ దగ్గర్లోని ఈ ఘటన జరిగింది. దీంతో స్థానికులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. అయితే ప్రస్తుతం థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల దగ్గర కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలకు బ్యాంకాక్‌లో జరిగిన కాల్పులకు ఏమైనా సంబంధం ఉందా ? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: గాజాలో ఆకలి మరణాలు.. వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్, అమల్లోకి కాల్పుల విరమణ
ఇదిలాఉండగా గత కొన్నేళ్లుగా బ్యాంకాక్‌లో దాడులు పెరిగిపోతున్నాయని పలువురు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మే నెలలో కూడా థాంగ్ అనే జిల్లాలో ఓ పాఠశాల దగ్గరల్లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా బ్యాంకాక్‌లో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. కాల్పుల తర్వాత నిందితుడు కూడా తనంతటా తాను కాల్చుకొని చంపుకోవడం అనుమానాలకు దారితీస్తోంది. దీని వెనుక ఉగ్రకుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.