Virat Kohli New Record: అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ! తొలి క్రికెటర్‌గా సరికొత్త రికార్డు
పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించి నూతన అధ్యయనానికి నాంది పలికాడు. ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్.. ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో కదం తొక్కాడు. టెస్టు క్రికెట్లో 29వ శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఓవరాల్‌గా విరాట్‌కు ఇది 76వ సెంచరీ కాగా.. 100 శతకాలతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.