/rtv/media/media_files/2025/07/26/pakistan-and-bangladesh-2025-07-26-11-54-53.jpg)
Pakistan, Bangladesh agree on visa-free entry for officials raising alarm in New Delhi
పాకిస్థాన్, బంగ్లాదేశ్ సంబంధాలు రోజురోజుకు బలోపేతమవుతున్నాయి. ఇటీవల ఇరుదేశాల మధ్య వీసా రహిత ఒప్పందం కుదిరింది. ఈ రెండు దేశాల్లోకి రాకపోకలు సాగించేందుకు వీసీ అవసరాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. పాకిస్థాన్ హోం మంత్రి మొహ్సిన్ నక్వీ, బంగ్లాదేశ్ హోం మంత్రి జహంగీర్ ఆలం చౌదరి మధ్య ఢాకాలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం వల్ల పాక్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది.
Also Read: 18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
Also Read : పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్.. వందలాది మందితో...
Pakistan - Bangladesh Agree On Visa-Free Entry
అలాగే ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, అంతర్గత భద్రత, పోలీసు శిక్షణ వంటి అంశాలపై ఇరుదేశాలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సూచిస్తున్నాయి. మరోవైపు పాక్, బంగ్లాదేశ్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ అప్రమత్తమయ్యింది. వీసా రహిత సౌక్యాన్ని వినియోగించుకొని పాక్ నిఘా సంస్థల ఏజెంట్లు లేదా అనుమానిత శక్తులు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ముంబయి ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు.. తీరా వెళ్లిచూస్తే ?
మరోవైపు బంగ్లాదేశ్ కూడా అంతర్గత ఉగ్రవాద కార్యక్రలాపాలను ప్రోత్సహిస్తోంది. 1971లో బంగ్లాదేశ్ పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాక్ వైఖరి పట్ల కఠినంగా ఉండేది. అయితే ఆమె ప్రభుత్వం కూలిపోవడంతో ఇటీవల మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి పాక్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలోపేతమవున్నాయి. టర్కీ కూడా ఇరు దేశాలతో సంబంధాలు పెంచుకుంటోంది.
Also Read : మస్త్ 'వైబ్ ఉంది బేబీ'.. మిరాయ్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!
bangladesh | rtv-news | telugu-news