/rtv/media/media_files/2025/07/24/russia-plane-crash-2025-07-24-13-04-24.jpg)
Russia Plane Crash
రష్యాకు చెందిన విమానం గాల్లోనే అదృశ్యమయ్యింది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం చైనా సరిహద్దుల్లోని టిండా నగరం వైపు వెళ్తుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే ఈ విమానం కుప్పకూలినట్లు అధికారులు నిర్ధరించారు. ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. దానికి సంబంధించిన శిథిలాలను కూడా గుర్తించారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ మృతి చెందినట్లు తెలుస్తోంది.
Tragedy in Russia: An AN-24 passenger plane with 48 onboard crashes near Tynda in the Amur region. Sadly, all lives were lost.Cause of the crash remains unknown. Our thoughts are with the victims and their families. #Russia#AviationNews#Tragedypic.twitter.com/NDIuLYntgn
— ceanmedia (@cryptoceannews) July 24, 2025
My deepest condolences >.. flight operators need to take more measures to avoid accidents
— Dr Srinubabu Gedela (@DrSrinubabu) July 24, 2025
Its sad to learn that repeatedly flights meet with accidents...A Russian passenger plane carrying about 50 people has crashed in the country’s east, leaving no survivors. My heartfelt… pic.twitter.com/MJRqb4yu1V
Russian plane with at least 50 people onboard goes missing in eastern Amur region
— News18 (@CNNnews18) July 24, 2025
News18's @AnvitSrivastava with details @kritsween | #russia#Plane#Aviation#ATC#RussianPlanepic.twitter.com/9TSHlzpWdv
ఇక వివరాల్లోకి వెళ్తే.. అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రష్యా నుంచి చైనాకు బయలు దేరింది. చైనాలోని ఆముర్ ప్రాంతంలోని టిండా నగరంలో ల్యాండ్ కావాల్సి ఉంది. గమ్యస్థానానికి చేరువకి రాగానే ఆ విమానం కమ్యూనికేషన్ తెగిపోయింది. టిండాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆ విమానం కుప్పకూలినట్లు అధికారులు స్పష్టం చేశారు.