Trump: ఆ రాత్రి ట్రంప్ నన్ను అదోలా చూశాడు.. అమెరికన్ ఆర్టిస్ట్‌ సంచలన ఆరోపణలు

ఎప్‌స్టీన్‌ వ్యవహారంపై కొన్ని దశాబ్దాల క్రితమే అమెరికన్ కళాకారిణి మారియా ఫార్మర్‌ దర్యాప్తు కోరారు. అయితే తాజాగా ఆమెపై ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సమయంలో ట్రంప్‌ తనకు ఎదురుపడి అసభ్యకరంగా చూశాడని చెప్పారు.

New Update
Kept staring at my legs, Epstein accuser recalls late-night encounter with Trump

Kept staring at my legs, Epstein accuser recalls late-night encounter with Trump

డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక కూడా లైంగిక వేధింపుల ఆరోపణలకు గురవుతున్నాడు. జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్‌ స్కామ్ ఫైల్స్‌ విడుదల చేస్తానని గతంలో ఆయనే హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇది ఆయన మెడకే చుట్టుకుంది. ఎప్‌స్టీన్‌ వ్యవహారంపై కొన్ని దశాబ్దాల క్రితమే అమెరికన్ కళాకారిణి మారియా ఫార్మర్‌ దర్యాప్తు కోరారు. అయితే తాజాగా ఆమెపై ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సమయంలో ట్రంప్‌ తనకు ఎదురుపడి అసభ్యకరంగా చూశాడని చెప్పారు. 

ఆరోజు జరిగిన తన చేదు అనుభవాన్ని ఇటీవల న్యూయార్క్ టైమ్స్‌ పత్రికతో మారియా పంచుకున్నారు. '' 1995లో నేను ఎప్‌స్టీన్ కోసం పనిచేసేందుకు సిద్ధమవుతున్నాను. ఓరోజు బాగా పోద్దుపోయింది. ఎప్‌స్టీన్ నాకు ఫోన్‌ చేసి మాన్‌హట్టన్‌ ఆఫీసులో కలవాలని చెప్పారు. నేను రన్నింగ్ షార్ట్స్‌ ధరించే ఆఫీస్‌కు వెళ్లాను. ఆ సమయంలోనే ట్రంప్ బిజినెస్ సూట్‌ ధరించి ఆ చోటుకి వచ్చారు. నాకు దగ్గర్లోనే ఆయన నిలబడి వేచి చూస్తున్నారు. 

Also Read: 224 మంది పోలీసులు మిస్సింగ్.. హోంశాఖలో కలకలం..

నా కాళ్ల వైపు అదేపనిగా ట్రంప్‌ చూడటాన్ని నేను గమనించాను. ఆ సమయంలో నాకు భయం వేసింది. అప్పుడు అక్కడికి వచ్చిన ఎప్‌స్టీన్.. నో..నో ఆమె నీ కోసం కాదు అంటూ ట్రంప్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారని'' మారియా వివరించింది. మరోవైపు ఈ వ్యాఖ్యలపై వైట్‌హౌస్‌ స్పందించింది. ఎప్‌స్టీన్ స్నేహాన్ని ట్రంప్ వదిలేసి చాలాకాలం అయ్యిందని తెలిపింది. అలాగే ట్రంప్ ఎప్పుడు కూడా ఎప్‌స్టీన్ ఆఫీస్‌కు వెళ్లలేదని తెలిపింది. ఎప్‌స్టీన్ చెత్త ప్రవర్తన వల్ల విసిగిపోయిన ట్రంప్  అతడ్ని తన క్లబ్ నుంచి వెళ్లగొట్టిన్లు పేర్కొన్నారు. 

ఇదిలాఉండగా మారియా 1996లోనే ఎప్‌స్టీన్, మ్యాక్స్‌వెల్ సెక్స్‌ ట్రాఫికింగ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఆనాడు FBIకి కూడా వీళ్ల గురించి సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ట్రంప్ పేరును కూడా ప్రస్తావించారు. 2006లో FBIతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె ట్రంప్‌ పేరును ప్రస్తావించడం అప్పట్లో దుమారం రేపింది.  

Also Read: గాజాలో మారణహోమం.. 59 వేల మందికి పైగా మృతి

Advertisment
తాజా కథనాలు