Boeing Flight: మరో బోయింగ్‌ విమానంలో చెలరేగిన మంటలు.. బయటికి దూకిన ప్రయాణికులు

అమెరికాలోని డెన్వర్‌ ఎయిర్‌పోర్టులో మరో పెను ప్రమాదం తప్పింది. కొలరొడో నుంచి మియామికి బయలుదేరిన బోయింగ్ 737 టేకాఫ్‌ అవుతుండగా మంటలు చెలరేగాయి. దీంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు.

New Update
American Airlines plane at Denver Airport was rapidly evacuated after one of its wheels caught fire

American Airlines plane at Denver Airport was rapidly evacuated after one of its wheels caught fire

అమెరికాలోని డెన్వర్‌ ఎయిర్‌పోర్టులో మరో పెను ప్రమాదం తప్పింది. కొలరొడో నుంచి మియామికి బయలుదేరిన బోయింగ్ 737 టేకాఫ్‌ అవుతుండగా మంటలు చెలరేగాయి. దీంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు. విమానం చుట్టు భారీగా పొగలు అలుముకున్నాయి. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గుర్యయారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులను బయటకు పంపించేశారు. విమానం టైర్లలో ఒకదానికి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. విమానం నుంచి ప్రయాణికులు బయటకు దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు వరుసగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం సంచలన రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఎయిరిండియాతో పాటు ఇతర విమానాల్లో కూడా సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేయడం, వెనక్కి మళ్లించడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. 

Also Read: కదులుతున్న కారులో మైనర్‌పై అత్యాచారం.. ఒకరి తర్వాత ఒకరు...

ఇదిలాఉండగా ఇటీవల రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో 49 మంది ప్రయాణికులు మృతి చెందారు. రష్యా నుంచి చైనాకు వెళ్తున్న విమానం.. గమ్యస్థానానికి చేరువలో ఓ అడవిలో కుప్పకూలింది. విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆరుగురు సిబ్బందితో సహా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో అయిదురు చిన్నారులు కూడా ఉన్నారు. ముందుగా ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత అది కూలిపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు.  

Advertisment
తాజా కథనాలు