/rtv/media/media_files/2025/01/31/ln5636qSAvPI9Q3AHDaW.jpg)
Washington Flights Accident
యూఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాఫ్టర్ నేరుగా అమెరికన్ ఎయిర్ లైన్స్ (American Airlines) జెట్ లోకి వెళ్ళింది. దీంతో విమానం రెడు ముఖ్కలై పదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో, హెలికాఫ్టర్ లో ఉన్న అందరూ చనిపోయారు. ఈ ఘటన ఫుటేజీ బయటకు వచ్చింది. దీనిపై అనేక అనుమానాలు, సందేహాలు తలెత్తుతున్నాయి. అసలు ఆర్మీ హెలికాఫ్టర్ ఎందుకు నేరుగా వెళ్ళి ఎయిర లైన్స్ ఫ్లైట్ ను ఢీకొట్టింది. ఎందుకు పైకి, లేదా కిందకు, వెనక్కు తిరిగి వెళ్లలేకపోయింది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ప్రశ్నించారు.
Also Read: TS: తెలంగాణ యూనివర్శిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు
ఎన్నో ప్రశ్నలు..మరెన్నో సందేహాలు..
ప్రస్తుతానికి దీనిని ఒక ప్రమాదంగానే పరిణిస్తున్నా... దీని వెనుక కుట్ర ఏమైనా దాగుందా అని సందేహాలు వెలువడుతున్నాయి. విమానం ఎగురుతున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. దాని లైట్లు సైతం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా సరే హెలికాఫ్టర్ దానిని ఎందుకు గమనించలేక పోయింది అని అడుగుతున్నారు. బ్లాక్ హాక్ ఆర్మీ హెలికాఫ్టర్ ఈ ప్రమాదం జరగకుండా కాపాడి ఉండవచ్చని..ఇదో పెద్ద విషాదం అని ట్రంప్ (Donald Trump) అన్నారు. కంట్రోల్ టవర్స్ ప్రమాద సమయంలో ఏం చేస్తున్నాయని అని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ప్రమాద సమయంలో ఏం ఆదేశాలు ఇచ్చిందని ట్రంప్ ప్రశ్నించారు. కావాలనే ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాఫ్టర్ కావాలనే విమానాన్ని క్రాష్ చేయడానికి ప్రయత్నించిందని... చాలా మంది ఆరోపిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి.
Also Read : కేరళ లిక్కర్ స్కామ్ .. ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్
తాజాగా ఈ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్యను అధికారులు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని.. అందరూ మరణించారని అధికారులు తెలిపారు. ఇప్పటికి విమానంలో 27 మంది డెడ్ బాడీలను, హెలికాఫ్టర్‌లో ఒకరి డెడ్ బాడీని గుర్తించినట్లు వాషింగ్టన్ డీసీ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జాన్ ఎ.డొనెల్లీ వెల్లడించారు.
Also Read : పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాకు పారిపోయాడు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Webcam at the Kennedy Center caught an explosion mid-air across the Potomac. https://t.co/v75sxitpH6 pic.twitter.com/HInYdhBYs5
— Alejandro Alvarez (@aletweetsnews) January 30, 2025
Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల్లో కేంద్రంగా యమనా నది..బోటులో తిరిగిన రాహుల్ గాంధీ