🔴Live News Updates: విద్యార్థుల మధ్య ఫేర్‌వెల్ పార్టీ చిచ్చు.. ఒకరు మృతి

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

By Lok Prakash & Manoj Varma
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలను ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడండి. 

 

 

  • Mar 01, 2025 15:25 IST

    విద్యార్థుల మధ్య ఫేర్‌వెల్ పార్టీ చిచ్చు.. ఒకరు మృతి

    కేరళలోని కోజికోడ్‌లో ఓ స్కూల్‌లో ఫేర్‌వెల్ పార్టీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రూపుల విద్యార్థులు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఓ పదవ తరగతి విద్యార్థి ఇతర విద్యార్థులపై దాడి చేయడంతో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.



  • Mar 01, 2025 14:53 IST

    పోసాని కృష్ణమురళికి తీవ్ర అస్వస్థత

    అన్నమయ్య జిల్లా రాజంపేట జైల్లో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  వెంటనే జైలు అధికారులు ఆయన్ను  రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  కాగా పోసానికి నిన్న కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.  

    Posani Krishna Murali



  • Mar 01, 2025 14:41 IST

    కేపీహెచ్‌బీలో కలకలం.. పూజశ్రీ ఎందుకు చనిపోయింది?

    హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పీఎస్​ పరిధిలో పూజశ్రీ అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 6వ ఫేజ్​లోని ఎలగెంట్​ అభిరుచి అపార్ట్‌మెంట్‌లో ప్లాట్​ నంబర్​ 204లో ఎవరూలేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    KPHB WOMEN SUCIDE
    KPHB WOMEN SUCIDE

     



  • Mar 01, 2025 14:41 IST

    ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!

    మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో మద్యం మత్తులో యువతీ యువకులు రోడ్లపై హంగామా చేశారు. ఒకే బైక్‌పై ఇద్దరు యువకుల మధ్య కూర్చున్న యువతి మద్యం మత్తులో సీటుపై నిలబడి ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చింది. వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

    viral video
    viral video Photograph: (viral video)

     



  • Mar 01, 2025 09:21 IST

    TS: వరంగల్ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

    వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మామునూరులో ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

    ts
    Warngal Air port

     



  • Mar 01, 2025 09:20 IST

    Children Porn case: చిన్నారుల నీలి చిత్రాలపై ఉక్కుపాదం.. 71 కేసుల్లో 47 మంది అరెస్టు!

    బాలికల అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్, సెర్స్ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ 2 నెలల్లో 71 కేసులు నమోదు చేసి 47 మందిని అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ తెలిపారు. ఫిర్యాదుకోసం 1930.

    porn case
    porn case Photograph: (porn case)

     



  • Mar 01, 2025 06:55 IST

    Crime News: నన్ను రేప్ చేశారు.. ప్రైవేట్ పార్ట్‌లో బాటిల్‌తో - సీన్ రివర్స్ కావడంతో మహిళ అరెస్ట్!

    యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ దారుణమైన ఆరోపణలు చేసి జైలుపాలైంది. తన భర్త వల్లే కడుపులోని బిడ్డ చనిపోయిందని ఫిర్యాదు చేసింది. తర్వాత తనభర్త స్నేహితులు అత్యాచారం చేశారంటూ మరో ఫిర్యాదు చేయగా, అవన్నీ తప్పుడు ఆరోపణలని గుర్తించి ఆమెను అరెస్టు చేశారు.

    Ghaziabad Woman Alleges Gang-Rape, Arrested After Claims Found False
    Ghaziabad Woman Alleges Gang-Rape, Arrested After Claims Found False Photograph: (Ghaziabad Woman Alleges Gang-Rape, Arrested After Claims Found False)

     



  • Mar 01, 2025 06:55 IST

    Champions Trophy: బ్యాడ్ లక్ ఆఫ్ఘాన్..సెమీస్ కు ఆసీస్

    ఛాంపియన్ షిప్ లో కీలకమైన ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఇవాళ వర్షార్పణమైంది. మ్యాచ్ మొదలై కొంత ఆడిన తర్వాత వర్షం పడడంతో...ఔట్ ఫీల్డ్ లో నీరు నిలిచిపోవడంతో మొత్తానికే రద్దు చేశారు. దీంతో ఆసీస్ సెమీస్ కు చేరుకుంది. 

    cricket
    Afghan Vs Ausis Match Cancelled

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు