/rtv/media/media_files/2025/01/30/HAQYDYvetYN0pn4wzVed.jpg)
Luo Puli, Deep SeeK Coder
ఈమె ఓ టెక్ సంచలనం...వయసు చిన్నదే అయినా ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. సునామీలా దూసుకొచ్చిన డీప్ సీక్ ఏఐ టెక్నాలజీ (AI Technology) రూపకర్తల్లో లూవో పులి ఒకరు. సిచువాన్ ప్రావిన్స్ లోని ఇబిన్ గ్రామీణ ప్రాంతం నుంచి లూసీ...బీజింగ్ లోని యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చదివింది. మొదట చదవడానికి కష్టపడిన లూవో పట్టుదలతో అందులో ప్రావీణ్యం సంపాదించింది. దీని తరువాత పెకింగ్ విశ్వవిద్యాలయంలో కంప్యుటేషనల్ లింగ్విస్టిక్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు దక్కించుకుంది. ఈమె మొట్టమొదటిసారి 2019లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఏసీఎల్ కాన్ఫరెన్స్‌లో ఎనిమిది పరిశోధన పత్రాలు ప్రచురించి అందరి దృష్టిలోనూ పడింది. ఆ తరువాత ఆలీబాబా డామూ అకాడమీలో రీసెర్చ్ స్కాలర్ గా చేరింది. అక్కడ మల్టీ లింగ్వల్ ప్రీ ట్రైనింగ్ మోడల్ డెవలప్‌మెంట్‌తోపాటు ఓపెన్‌సోర్స్ అలైస్‌మైండ్ ప్రాజెక్టులోనూ కీలకంగా పనిచేశారు.
Also Read : ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్...ఎంత డబ్బు లెక్కపెడితే అంతా మీకే..కానీ కేవలం..!
డీప్ సీక్ లో కీలక పాత్ర..
ఈ ప్రాజెక్టు ఆమె జాతకాన్నే మార్చేసింది అని చెప్పాలి. దీంతో లూవోకి డీప్ సీక్ (Deep Seek) లో పని చేసే అవకాశం వచ్చింది. 2022లో ఈ ఏఐ టెక్నాలజీ కంపెనీతో పని చేయడం ప్రారంభించింది. లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో లూవోకి ఉన్న నైపుణ్యం డీప్ సీక్ లో ప్రముఖ పాత్ర పోషించేలా చేసింది. ఈ ఏఐ టెక్నాలజీ రూపకల్పనలో లూవోతో పాటూ మరి కొందరు పని చేశారు. కానీ ఎక్కువ క్రెడిట్ మాత్రం ఈమెకే దక్కుతుందని చెబుతున్నారు. డీప్ సీక్ లో లూవో పనితీరుకు మెచ్చిన షావోమీ ఫౌండర్ లీ జున్...ఆమెకు ఏడాదికి 10 మిలియన్ యువాన్లు అంటూ భారత కరెన్సీలో రూ.11.9 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా చేశారు.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్
ప్రస్తుతం లూవో పేరు ప్రపంచం అంతా మారుమోగిపోతోంది. దీన్ని ఈమె ఎంజాయ్ చేస్తోంది. డీప్ సీక్ విజయాన్ని అందరూ తనకు ఇస్తున్నారు కానీ ఇది సమిష్టి విజయం అంటూ చాలా వినయంగా సమాధానం చెబుతోంది లూవో. డీప్ సీక్ ప్రభంజనం మామూలుగా లేదు. దీని కన్నా ముందు వచ్చిన చాట్ జీపీటీ, జెమనీ, క్లాడ్ ఏఐ లాంటి వాటికి ఇది సవాల్ విసురుతోంది. వాటి కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
Also Read : ప్లే స్టోర్ లో డీప్ సీక్ దూకుడు..కానీ ఆ ప్రశ్నలకు మాత్రం!