USA: బైడెన్ వదిలేయమన్నారు..ట్రంప్ తొందరగా తీసుకురమ్మన్నారు..వ్యోమగాములపై మస్క్

అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను తీసుకురావడం బైడెన్ ప్రభుత్వం వల్లనే ఆలస్యం అయిందని అంటున్నారు ఎలాన్ మస్క్. కొత్త అధ్యక్షుడు ట్రంప్ మాత్రం వ్యోమగాములను తొందరగా తీసుకురావాలని చెప్పారని మస్క్ తెలిపారు. 

New Update
Starlink Satellite and Elon Musk

Starlink Satellite and Elon Musk

మూడోసారి అంతరిక్షంలోకి వెళ్ళిన సునీతా విలియమ్స్ (Sunita Williams) సాంకేతిక కారణాల వలన అక్కడే చిక్కుకుపోయారు. ఈమెతో పాటూ బుచ్ విలోమోర్ అనే వ్యోమగామి కూడా ఉండిపోయారు. అసలు వారి మిషన్ ప్రకారం వ్యోమగాములు నెలరోజుల్లో భూమి మీదకు తిరిగి రావాలి. కానీ ఇప్పటికీ వారిద్దరూ ఎప్పుడూ వస్తారో తెలియడం లేదు. దీనంతటికీ కారణం బైడెన్ ప్రభుత్వమే అంటున్నారు ఎలాన్ మస్క్.

Also Read :  జపాన్‌కు రండి... ట్రంప్‌కు ఆహ్వానం.. ఎందుకంటే!

అసలు పట్టించుకోలేదు..

జూన్ 6న సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు రోదసిలోకి వెళ్ళారు. అదే నెలలో 14న వెనక్కు తిరిగి వచ్చేయాలి. లేట్ అయినా నెలలోపు భూమి మీదకు చేరుకోవాలి. కానీ ఇప్పటి వరకు వెన్కు తిరిగి రాలేదు. దానికి కారణం బైడెన్ ప్రభుత్వమే అంటున్నారు టెక్ టైటాన్ ెలాన్ మస్క. బైడెన్ ప్రభుత్వం వ్యోమగాములను పట్టించుకోలేదు. వారిని వదిలేయమని చెప్పింది. తాము ఎంత అడిగినా సరైన సమయానికి డెసిషన్ తీసుకోలేదు. అందువల్లే సునీతా విలియమ్స్, బుచ్ లు అంతరిక్షంలో చిక్కుకుపోయారని మస్క్ చెప్పారు. దీనికి సంబంధించి ఆయన ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఇప్పుడు ట్రంప్ వ్యోమగాములిద్దరినీ తొందరగా తీసుకురావాలని చెప్పారని ఎలాన్ మస్క్ తెలిపారు. స్పేష్ స్టేషన్ లో వారు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారని..ఇంక వారిని ఎలా అయినా తీసుకురావాల్సిందేనని ట్రంప్ అడిగారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాము అదే పనిలో ఉన్నామని...సునీతా, బెచ్ లను తొందరలోనే భూమి మీదకు తీసుకువస్తామని మస్క్ చెప్పారు. 

Also Read :  AI రంగంలో చైనా సంచలనం.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే

నడవడం మర్చిపోయా...

మరోవైపు తాను నడవడం, కూర్చోవడం మర్చిపోయానని చెప్పారు సునీతా విలియమ్స్. రీసెంట్ గా అంతరిక్షం నుంచి విద్యార్థులతో మాట్లాడిన ఆమె..జీరో గ్రావిటీలో 7 నెలలుగా  ఉండడంతో నేలపై నడిచిన అనుభూతిని గుర్తు తెచ్చుకోలేకపోతున్నా అని చెప్పారు. నడవలేను, కూర్చోలేను, సడుకుని విశ్రాంతి తీసుకోవడానికి అవదు అంటూ తమ ఇబ్బందులను చెప్పుకొచ్చారు. నెలరోజుల్లోపే వచ్చేయాల్సిన తాము ఏడు నెలలు ఇక్కడే ఉండిపోవడం చాలా షాకింగ్ గా ఉందని సునీతా అన్నారు. 

Also Read: Deep Seek: డీప్ సీక్ వెనుక అందమైన అమ్మాయి..టెక్ సంచలనం

Also Read :  అరుణాచల్‌ప్రదేశ్‌పై అడిగిన ప్రశ్నకు డీప్‌సీక్‌ షాకింగ్ ఆన్సర్‌..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు