/rtv/media/media_files/2025/02/01/gzLwoLsP13iti26hYDQF.jpg)
Budget
మరో నాలుగు రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budget 2025) ఢిల్లీ ప్రజలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి ఎన్నికల కోడ్ ఉన్న క్రమంలో ఢిల్లీకి సంబంధించి బడ్జెట్ కేటాయింపు విషయంలో దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్ (Election Commission) ఇప్పటికే కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు కాస్త ఊరటనిచ్చేలా రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు, గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా వంటి ప్రకటనలు చేసింది. అయితే కొత్త ఆదాయప పన్ను విధానం ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించవచ్చనే అంచనాలు వస్తున్నాయి.
Also Read: బడ్జెట్‌లో మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు!
ఢిల్లీలో చూసుకుంటే 3 కోట్లకు పైగా జనాభా ఉంది. ఇందులో కోటిన్నర మందికి ఓటు హక్కు ఉంది. అంటే దాదాపు 45 శాతం మంది మధ్యతరగతికి చెందినవారే. పన్ను కట్టేవారి సంఖ్య దాదాపు 40 లక్షలుగా ఉంది. వీళ్లతో పాటు గిగ్ వర్కర్లకు కూడా ఎక్కువగానే ఉన్నారు. రెండు వర్గాలకు లబ్ధి జరిగేలా బడ్జెట్ ఉంది. రూ. 12 లక్షల వరకు ట్యాక్స్ లేకపోవడం అనేది లక్షలాది మంది వేతన జీవులకు ఊరట కలిగించే అంశం.
Also Read: జనగణన ఈ ఏడాది ఉంటుందా ? లేదా ?
Also Read : డిగ్రీ చేసిన వారికి గుడ్ న్యూస్.. నెలకు రూ.85,920 జీతం సంపాదించే ఛాన్స్..!
Union Budget 2025
కొత్త ఆదాయపు పన్ను విధానం ద్వారా దేశంలో కోటి మందికి ఆదాయపు పన్ను నుంచి ఊరట లభిస్తందని ప్రభుత్వమే చెబుతోంది. ఇందులో ఢిల్లీ వాసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటంతో ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో దీని ప్రభావం ఉండే ఛాన్స్ కనిపిస్తోందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే ఈసారి ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: బడ్జెట్‌పై తొలిసారిగా స్పందించిన నిర్మలా సీతారామన్