/rtv/media/media_files/2025/10/28/pakistan-violates-ceasefire-in-jammu-and-kashmir-2025-10-28-17-08-26.jpg)
Pakistan violates ceasefire in Jammu and Kashmir
Pakistan: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో గట్టిగా బుద్ధిచెప్పినా కూడా పాక్ తీరు మారలేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. కానీ పాక్ మాత్రం ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా సరిహద్దుల్లో భారత స్థావరాలపై కాల్పులకు పాల్పడింది. అక్టోబర్ 26న రాత్రికి జమ్మూకశ్మీర్‌లోని లీపా వ్యాలీలో ఈ కాల్పులు జరిగాయి.
Also Read: ఢిల్లీలో కృత్రిమ వర్షానికి సిద్ధం.. పూర్తయిన క్లౌడ్ సీడింగ్
దీంతో వెంటనే రంగంలోకి దిగిన భారత సైన్యం పాక్‌కు గట్టిగా బదులిచ్చింది. వాళ్ల దాడులను తిప్పికొట్టింది. భారత జవాన్ల ఎదురుకాల్పులతో పాక్ సైనికులు తోక ముడిచి పారిపోయారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. చివరికి ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.
Also read: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 8వ వేతన సంఘం నియమావళికి కేబినెట్ ఆమోదం
దీంతో ఈ ఏడాది మే 10 నుంచి ఇరు దేశాల సైనికుల మధ్య నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి కాల్పుల జరగలేదు. తాజాగా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత సైన్యం పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది.
Also Read: కరీంనగర్ జిల్లాలో దారుణం..ప్రభుత్వ పాఠశాల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు
Follow Us