Indian Army: త్రిశూల్‌ విన్యాసాలకు సిద్ధమైన త్రివిధ దళాలు.. పాక్‌ కీలక నిర్ణయం

భారత త్రివిధ దళాలు త్రిశూల్‌ విన్యాసాలకు రెడీ అయిపోయాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ అప్రమత్తమైంది. తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటమ్ జారీ చేసింది.

New Update
Rattled Pakistan restricts airspace ahead of India's military exercise near Sir Creek

Rattled Pakistan restricts airspace ahead of India's military exercise near Sir Creek

భారత త్రివిధ దళాలు త్రిశూల్‌ విన్యాసాలకు రెడీ అయిపోయాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ అప్రమత్తమైంది. తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ  విమానయాన సంస్థలకు నోటమ్ జారీ చేసింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు పాకిస్థాన్ సరిహద్దుల్లో సర్‌క్రీక్‌ ప్రాంతంలో భారత త్రివిధ దళాలు విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. పాక్‌ తమ గగనతంలలో వైమానిక మార్గాలను పరిమితం చేసింది. డా. డామియన్ సైమన్ దీనికి సంబంధించి ఓ శాటిలైట్ చిత్రాన్ని షేర్ చేశారు.  

Also Read: ఢిల్లీ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. యమునా నీళ్లు తాగాలంటూ ఆప్‌ నేతల ఆందోళనలు

28 వేల అడుగుల ఎత్తు వరకు భారత త్రివిధ దళాలు విన్యాసాలు చేసేందుకు గగనతలాన్ని రిజర్వ్ చేసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్‌ అనంతరం త్రివిధ దళాలు ఇలా ఉమ్మడిగా కలిసి ఇంతపెద్ద విన్యాసాలు చేయడంపై ఆసక్తి నెలకొంది. ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలు, స్వావలంబనను ప్రదర్శించడమే టార్గెట్‌గా దీన్ని ఏర్పాటు చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇలాంటి విన్యాసాలు సాధారణ సన్నద్ధత చర్యలే అయినా ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సరిహద్దును నిశితంగా గమనిస్తున్నామని చెప్పడం కోసమే పాక్ నోటమ్ జారీ చేసినట్లు సమాచారం.   

Also Read: మదర్ రాక్..డాటర్స్ షాక్..కూతుళ్లు నిద్ర లేవడం లేదని ఓ తల్లి ఏం చేసిందంటే..?

Advertisment
తాజా కథనాలు