/rtv/media/media_files/2025/12/18/arjun-mk-1a-2025-12-18-11-31-21.jpg)
పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీలోని అర్జున్ యుద్ధ ట్యాంక్‌ల గురించి వణుకుపడుతోంది. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అర్జున్ Mk-1A ట్యాంక్ ఇప్పుడు రక్షణ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. 2021లో కేంద్ర ప్రభుత్వం 118 ట్యాంకుల కోసం రూ.7,523 కోట్ల భారీ ఆర్డర్‌ను ఇచ్చింది. అంటే ఒక్కో ట్యాంక్ ధర సుమారు రూ.64 కోట్లు. రష్యా నుంచి తెచ్చుకున్న T-90 ట్యాంకులతో (రూ.36-40 కోట్లు) పోలిస్తే అర్జున్ ధర ఎక్కువగానే అనిపించవచ్చు. కానీ, అమెరికాకు చెందిన 'అబ్రమ్స్' (రూ.84 కోట్లు) వంటి పాశ్చాత్య ట్యాంకులతో పోలిస్తే అర్జున్ చాలా చౌక.
Arjun MK-1A upgrade in same posture!
— Photon (Фотон) (@S12Ajeesh) March 9, 2025
P.C: on video #DRDOhttps://t.co/hFlF4eCtiDpic.twitter.com/vJLgdNT2f3
అర్జున్ Mk-1A తక్కువ సంఖ్యలో ఉత్పత్తి కావడం, సరికొత్త సాంకేతికతను వాడటం వల్ల ధర ఎక్కువగా ఉంది. ఈ ట్యాంకులో 54% పైగా భాగాలు స్వదేశీవే కావడం విశేషం. దీనివల్ల మన దేశం స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది.
72 కొత్త ఫీచర్లతో అర్జున్ Mk-1A
పాత వెర్షన్‌తో పోలిస్తే Mk-1Aలో దాదాపు 72 మార్పులు చేశారు. శత్రు మిస్సేల్స్ నుంచి రక్షించే అత్యంత శక్తివంతమైన 'కాంచన్' కవచం దీని సొంతం. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఏ వాతావరణంలోనైనా శత్రువును ఖచ్చితంగా వేటాడగల 120 mm రైఫిల్డ్ గన్ ఇందులో ఉంది. 68 టన్నుల బరువు ఉన్నప్పటికీ, 1400 హార్స్‌పవర్ ఇంజిన్ సాయంతో ఎడారి ఇసుకలోనూ ఇది వేగంగా దూసుకుపోగలదు. లేజర్ వార్నింగ్ సిస్టమ్, నైట్ విజన్ వంటి అత్యాధునిక ఫీచర్లు దీనికి అదనపు బలాన్నిస్తాయి.
DRDO అభివృద్ధి చేసిన ఈ ట్యాంక్, పరీక్షల్లో రష్యన్ T-90 కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ప్రస్తుతానికి ఇవి శిక్షణ, తయారీ దశలో ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో భారత సరిహద్దుల్లో ఇవి ప్రధాన రక్షణ కవచాలుగా మారనున్నాయి. ఇకపై భారత్ ఆయుధాలను కొనుగోలు చేయడమే కాదు, సొంతంగా తయారు చేసుకోగలదని అర్జున్ నిరూపిస్తోంది.
Follow Us