ఇండియన్ ఆర్మీలో లక్ష మందితో భైరవ్ దళం.. ఇక యుద్ధంలో డ్రోన్లతో చెడుగుడే!

భారత సైన్యం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఏకంగా లక్ష మంది డ్రోన్ ఆపరేటర్లతో కూడిన భారీ దళాన్ని సిద్ధం చేసింది. దీనికి తోడు, అత్యంత శక్తిమంతమైన 'భైరవ్' అనే సరికొత్త స్పెషల్ ఫోర్స్ దళాన్ని రంగంలోకి దించింది.

New Update
Bhairav Force

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అన్నీ మారిపోతున్నాయి. ఒకప్పుడు యుద్ధాలు అంటే కత్తులు, బళ్లాలు, బాణాలు.. కానీ ఇప్పుడు దేశాల మధ్య యుద్ధమంటే మిస్సైల్స్, న్యూక్లియర్ బాంబ్స్, డ్రోన్లు. మారుతున్న ఆధునిక వార్ టెక్నిక్స్ అనుగుణంగా ఇండియర్ ఆర్మీ కూడా తన రూపురేఖలను మార్చుకుంటోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఏకంగా లక్ష మంది డ్రోన్ ఆపరేటర్లతో కూడిన ఫోర్స్‌ను సిద్ధం చేసింది. దీనికి తోడు, అత్యంత శక్తిమంతమైన 'భైరవ్' అనే సరికొత్త స్పెషల్ ఫోర్స్ దళాన్ని రంగంలోకి దించింది. 

ఇండియన్ ఆర్మీలో భైరవ్ ఫోర్స్
ప్రస్తుత యుద్ధాల్లో క్షిపణులు, యుద్ధ విమానాల కంటే డ్రోన్ల పాత్రే అత్యంత కీలకంగా మారుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో భారత సైన్యం తన 'ఇన్‌ఫాంట్రీ'ని టెక్నాలజీతో డెవలప్‌ చేసింది. ఇందులో భాగంగానే 'భైరవ్' బెటాలియన్లను ఏర్పాటు చేసింది.

లక్ష మంది డ్రోన్ ఆపరేటర్లు

భారత సైన్యం తన బలగాలలో దాదాపు లక్ష మంది సైనికులకు డ్రోన్లను ఆపరేట్ చేయడంలో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద 'డ్రోన్ ఆపరేటివ్' వ్యవస్థగా అవతరించనుంది. ప్రతి సైనికుడు డ్రోన్లను ఎగరవేయడం, శత్రువుల స్థావరాలను గుర్తించడం, వాటిపై కచ్చితమైన దాడులు చేయడంలో ఎక్స్‌పర్టే. వీరు కేవలం నిఘా కోసమే కాకుండా, శత్రువుల ట్యాంకులు, బంకర్లను ధ్వంసం చేసే 'కామికేజ్' (ఆత్మాహుతి) డ్రోన్లను కూడా నడుపుతారు.

'భైరవ్' ఫోర్స్ స్పెషాలిటీ

భైరవ్ దళాన్ని నార్మల్ ఇన్‌ఫాంట్రీ ఫోర్స్, పారా స్పెషల్ ఫోర్సెస్‌కు మధ్య ఓ బ్రిడ్జ్‌లా రూపొందించారు. ఈ దళం కోసం ఎక్కువగా రాజస్థాన్‌కు చెందిన యువకులను ఎంపిక చేశారు. వీరికి ఎడారి పరిస్థితులు, అక్కడి భాష, భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంటుంది. శత్రువుల సరిహద్దు దాటి లోపలికి చొచ్చుకుపోయి, అక్కడి కీలక స్థావరాలను డ్రోన్ల సాయంతో ధ్వంసం చేయడం వీరి మెయిన్ డ్యూటీ. ఇప్పటికే 15 భైరవ్ బెటాలియన్లు సిద్ధమయ్యాయి. త్వరలో వీటి సంఖ్యను 25కు పెంచనున్నారు. వీటిని పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో మోహరించారు.

రుద్ర బ్రిగేడ్స్, కాల భైరవ్ డ్రోన్లు
భైరవ్ దళంతో పాటు 'రుద్ర బ్రిగేడ్స్' పేరుతో మరో వ్యవస్థను కూడా ఆర్మీ తీసుకొచ్చింది. ఇందులో ట్యాంకులు, ఫిరంగి దళం, పదాతి దళం, డ్రోన్ యూనిట్లు అన్నీ కలిసి ఒకే గొడుగు కింద పనిచేస్తాయి. అలాగే, 'కాల భైరవ్' పేరుతో స్వదేశీ తయారీ యుద్ధ డ్రోన్ కూడా రక్షణ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. ఇది దాదాపు 3000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి దాడులు చేయగలదు.

జనవరి 15న తొలి ప్రదర్శన
ఈ ఏడాది జనవరి 15న జైపూర్‌లో జరగనున్న ఆర్మీ డే పరేడ్‌లో ఈ 'భైరవ్' దళం తొలిసారిగా ప్రపంచానికి తన సత్తా చాటనుంది. మారుతున్న టెక్నాలజీతో భారత సైన్యం ఎంత వేగంగా దూసుకుపోతుందో చెప్పడానికి ఈ దళమే ఒక ప్రత్యక్ష నిదర్శనం.

Advertisment
తాజా కథనాలు