Pakistan: భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్ కుట్ర !
పాక్ చైనాతో కలిసి భారత్‌పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకునేందుకు పాకిస్థాన్ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం.
పాక్ చైనాతో కలిసి భారత్‌పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకునేందుకు పాకిస్థాన్ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం.
మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ సైన్యం ప్రధాని మోదీ పాదాలకు నమస్కరిస్తుందని అన్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
2007 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పై టీమిండియా సాధించిన ఓ విజయాన్ని ఆపరేషన్ సిందూర్‌తో అనుసంధానిస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) ట్వీట్ చేస్తూ పాకిస్తాన్ సైన్యంపై విమర్శలు గుప్పించింది. ఈ పోస్ట్ వెంటనే వైరల్ గా మారింది.
సొంత దేశంలోనే పాకిస్తాన్‌కు ఘోర అవమానం జరిగింది. భారత్ తో జరిగిన యుద్ధం విషయంలో ఇప్పటికే చాలా అబద్ధాలు ఆడిన పాకిస్తాన్ .. మరో అబద్ధం ఆడి సొంత దేశంలోనే పరువు తీసుకుంది. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌ను ది టెలిగ్రాఫ్ ప్రశంసించిందని ఫేక్ ప్రచారం చేసుకుంది
ఆపరేషన్ సిందూర్ ఫలితంగా భారత రక్షణ బడ్జెట్ మరో రూ.50,000 కోట్లు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పెంపుదల ఆమోదం పొందితే, 2025–26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రక్షణ శాఖకు కేటాయింపులు రూ.7 లక్షల కోట్లకు మించిపోతాయి.
మే 9న ఆపరేషన్ సిందూర్ విజయాన్ని జరుపుకుంటుండగా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను తన బాల్కనీ నుండి పాకిస్తాన్ అనుకూలంగా జై పాకిస్తాన్ నినాదాలు చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
పాకిస్తాన్ లో ఎలాంటి మార్పు రాలేదు. కుక్క తోక వంకరే అన్నట్లుగా వ్యవహారిస్తోంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం మరోసాయం చేసేందుకు సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ధ్వంసం అయిన ఉగ్రవాద స్థావరాల పునర్నిర్మాణం చేసే బాధ్యతలను తన భుజాలపై ఎత్తుకోబోతుంది.
తాలిబన్ విదేశాంగశాఖ మంత్రి అమీర్‌ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ ఫోన్లో మాట్లాడారు. తాలిబన్ ప్రభుత్వంతో మంత్రుల స్థాయిలో భారత్ సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. 2025 జనవరిలో విక్రమ్ మిస్రీ.. ముత్తాఖీని దుబాయ్‌లో కలిశారు.