/rtv/media/media_files/2025/05/16/SK4rHsnUd2NXPwkvY5dU.jpg)
ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి తర్వాత భారత్ కౌంటర్ గా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఖచ్చితమైన వైమానిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మసూద్ అజార్ లాంటి తీవ్రమైన ఉగ్రవాదలు కూడా చనిపోయారు. కాల్పుల విరమణతో ఇరుదేశాల మధ్య పరిస్థితులు సాధరణ స్థితికి చేరుకున్నాయి. ఇంత జరిగిన పాకిస్తాన్ లో ఎలాంటి మార్పు రాలేదు. కుక్క తోక వంకరే అన్నట్లుగా పాక్ వ్యవహారిస్తోంది.
ఉగ్రవాదులకు మరోసాయం
ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం మరోసాయం చేసేందుకు సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ధ్వంసం అయిన ఉగ్రవాద స్థావరాల పునర్నిర్మాణం చేసే బాధ్యతలను తన భుజాలపై ఎత్తుకోబోతుంది. ప్రభుత్వ నిధులతో జైషే మహ్మద్ ఉగ్రస్థావరం పునర్మిర్మాణం చేపడతామని పాకిస్థాన్ మంత్రి రాణా తన్వీర్ హుస్సేన్ స్వయంగా వెల్లడించారు. "భారత్ ఆపరేషన్‌లో భాగంగా ధ్వంసమైన మసీదు మర్కజ్ తైబా పునర్నిర్మాణం జరుగుతుంది. పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, పాకిస్థాన్ సైనిక అధిపతి అసిమ్ మునీర్ పునర్నిర్మాణ ఖర్చును భరిస్తారు" అని వెల్లడించారు. ప్రభుత్వ సాయంతో పాటు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం పాక్ పీఎం, ఆర్మీ చీఫ్ సాయం చేస్తారని తెలిపారు.
Also read : India -Afghanistan: పాక్ కు బిగ్ షాక్.. తాలిబన్లతో భారత్ చర్చలు!
పాకిస్తాన్ తీరుపై భారత్ తో పాటుగా ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ పాల్గొంది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్‌లో మరణించిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారాన్ని కూడా ప్రకటించింది. ఈ లెక్కన ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబానికి రూ.14 కోట్ల పరిహారం అందనుంది. ఒకపక్కా తమకు ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధం లేదంటూనే పాక్ వారికి వెనుక ఉండి సహాయం చేస్తుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also read : Jai Shankar: పాక్ ఆరోపణలను ఖండించిన ఆఫ్ఘాన్..థాంక్స్ చెప్పిన జైశంకర్