BJP: ఆపరేషన్‌ సిందూర్‌ : పాక్ ఆర్మీని టీ20 వరల్డ్‌కప్‌ వీడియోతో పోల్చిన బీజేపీ-VIRAL VIDEO

2007 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పై టీమిండియా సాధించిన ఓ విజయాన్ని ఆపరేషన్ సిందూర్‌తో అనుసంధానిస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) ట్వీట్ చేస్తూ పాకిస్తాన్ సైన్యంపై  విమర్శలు గుప్పించింది. ఈ పోస్ట్ వెంటనే వైరల్ గా మారింది.  

New Update
2007-t-20-world-cup

BJP

BJP: 2007 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పై టీమిండియా సాధించిన ఓ విజయాన్ని ఆపరేషన్ సిందూర్‌తో అనుసంధానిస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) ట్వీట్ చేస్తూ పాకిస్తాన్ సైన్యంపై  విమర్శలు గుప్పించింది. 2007లో సూపర్‌ ఓవర్‌కు ప్రత్యామ్నాయంగా భారత్‌, పాక్‌ జట్లకు బౌల్‌ ఔట్‌ పోటీ జరిగింది  మూడు బాల్స్‌లో భారత క్రికెటర్లు మూడు సార్లు వికెట్లు పడగొట్టగా..  పాక్‌ బౌలర్లు వేసిన మూడు బాల్స్‌లో ఒక్కటి కూడా తగలకపోవడంతో భారత్‌ విజేతగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ట్వీట్ చేస్తూ  “కుచ్ ఐసా థా (అలాంటిదేదో)”  అంటే ట్యాగ్ లైన్ ను జోడించింది.  ఈ పోస్ట్ వెంటనే వైరల్ గా మారింది.  

Also Read : కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టులు హతం..!

Also Read: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్ పేరుతో

ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి తర్వాత భారత్ కౌంటర్ గా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఖచ్చితమైన వైమానిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.  ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే 30 మంది పాక్ సైనికులు హతమయ్యారు. భారత్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ వైమానిక స్థావరాలను కూడా దెబ్బతీసింది. అటు పాకిస్తాన్ కూడా ప్రతీకారంలో భాగంగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించినప్పటికీ భారత్ వాటిని సమర్థవంతంగా ఎదురుకుని కూల్చివేసింది.  దీనిని బీజేపీ 2007 టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్ తో పోలుస్తూ ట్వీట్ చేస్తూ విమర్శలు గుప్పించింది. 

AlsoRead :రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి 3 నెలల రేషన్!

2007 T20 world cup | operation Sindoor | pakistan