Cricket: మూడో మ్యాచ్ లోనూ విజయం..ఇంగ్లాండ్ తో వన్డే సీరీస్ క్లీన్ స్వీప్
ఇంగ్లాండ్ జరిగిన మూడో వన్డేలో కూటా టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 142 పరుగుల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ను చితక్కొట్టేసింది. దీంతో వన్డే సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసినట్టయింది.
ఇంగ్లాండ్ జరిగిన మూడో వన్డేలో కూటా టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 142 పరుగుల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ను చితక్కొట్టేసింది. దీంతో వన్డే సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసినట్టయింది.
ఇంగ్లాండ్ తో టీ20 సీరీస్ గెలిచింది. వన్డే సీరీస్ లోనూ మొదటి మ్యాచ్ లో విజయం సాధించి దూకుడు మీద ఉంది టీమ్ ఇండియా. ఈరోజు రెండో మ్యాచ్ ఆడనుంది. దీనిలో కింగ్ కోహ్లీ బరిలోకి దిగుతుండడంతో...అందరి దృష్టీ అతని మీదనే ఉంది.
ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్ లో టీమిండియా దుమ్మురేపింది. ఏకంగా 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వాంఖడే స్టేడియంలో ఇప్పటివరకు ఇదే టాప్ స్కోర్ కావడం విశేషం. అభిషేక్ శర్మ 135 పరగులతో వీరవిహారం చేశాడు.
వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచారు. మూడోది కూడా గెలిస్తే సీరీస్ మనదే అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ టీమ్ అలా జరగనివ్వలేదు. మూడో టీ20లో గెలిచి...సీరీస్ పై ఆశలను సజీవం చేసుకుంది.
భారత్ - ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ షెడ్యూల్ రిలీజైంది. 2025 జూన్ 20తో మొదలై ఆగస్ట్ 4న ఈ సిరీస్ ముగుస్తుందని బీసీసీఐ, ఈసీబీ ప్రకటించాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫోర్త్ స్టేజ్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.
తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను ఖండించిన రోహిత్...తాను ఎప్పుడైతే సరిగ్గా ఆడటం లేదని భావిస్తానో అప్పుడే క్రికెట్ కు వీడ్కోలు పలుకుతానంటూ పేర్కొన్నాడు.
2012 ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్. తన తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడానికి ఆ సిరీస్ తనకు సహాయపడిందని చెప్పాడు. అశ్విన్ తన కెరీర్లో 100వ టెస్టును రేపు(మార్చి 7) ఆడనున్నాడు.
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి టెస్టు ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు రెండు జట్లు మాత్రమే మిగిలిన నాలుగు టెస్టులు గెలుచుకున్నాయి. 112ఏళ్ల క్రితం ఇంగ్లండ్ ఇలా చేసింది. మళ్లీ ఆ తర్వాత ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. దీంతో రోహిత్ ఈ కొత్త రికార్డును సమం చేసేందుకు ట్రై చేస్తున్నాడు.
ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఆరంభంలో కాస్త తడబడినా మ్యాచ్‌ను గెలిపించారు ఇండియన్ బ్యాటర్లు. ఐదు వికెట్ల తేడాతో తో టీమ్ ఇండియా ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేశారు. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సీరీస్‌ను భారత్ 3-1తో సొంతం చేసుకుంది.