/rtv/media/media_files/2025/02/02/BO51ruWdZKpNWPpzs3H1.jpg)
India vs England Photograph: (India vs England )
ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్ లో టీమిండియా దుమ్మురేపింది. ఏకంగా 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వాంఖడే స్టేడియంలో ఇప్పటివరకు ఇదే టాప్ స్కోర్ కావడం విశేషం. అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరగులతో వీరవిహారం చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 13 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. 18వ ఓవర్‌లో ఔట్ అయ్యాడు. శాంసన్ (16), సూర్య (2), పాండ్య (9), రింకు (9) పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ 3, వుడ్ 2, ఆర్చర్, రషీద్, ఒవర్టన్ తలో వికెట్ తీశారు.
అభిషేక్ శర్మ అరుదైన రికార్డు
భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20ల్లో ఒక ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు. 54 బంతుల్లోనే 13 సిక్సర్లు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశారు. మరోవైపు ఒకే ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ ప్లేయర్ గానూ నిలిచాడు అభిషేక్. ఇప్పటివరకు 10 సిక్స్‌లతో రోహిత్ తొలి స్థానంలో ఉన్నాడు.
టీమిండియా జట్టు : సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లండ్ జట్టు : ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్, జాకబ్ బెతల్, బ్రైడన్ కార్స్, జేమీ ఒవర్టన్, జోఫ్రా ఆర్చర్, అడిల్ రషీద్, మార్క్ వుడ్
Also Read : BCCI : టీమిండియా మహిళా జట్టుకు బీసీసీఐ భారీ నజరానా
Innings Break!
— BCCI (@BCCI) February 2, 2025
A smashing batting performance from #TeamIndia 🔥🔥
Abhishek Sharma's incredible TON powers his side to 247/9 👏👏
Over to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/B13UlBNdFP#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/J9b48OVlUy